ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి బుధవారం పలువురు భక్తులు విరా ళాలు సమర్పించారు. తాడిగడప రామానగర్‌కు చెందిన చిగురుపాటి శ్రీనివాసరావు, సాయిమిత్ర దంపతులు అమ్మవారి అన్నదానానికి రూ.1,01,111 విరాళాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. హైదరాబాద్ ప్రగతినగర్‌కు చెందిన శరధి వల్లభజోష్యుల రూ.లక్ష విరాళం సమర్పించారు. గుంటూరు జిల్లా తాడేపల్లికి చెదిన పి.నాగఆదిత్య రూ.లక్ష విరాళం అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఆలయ పర్యవేక్షకులు నాగేశ్వరరావు, మధు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందించారు.


