లబ్బీపేట(విజయవాడతూర్పు): క్రీడలు పోలీసుల్లో ఒత్తిడిని తగ్గించడమే కాకుండా శారీరక దృఢత్వాన్ని, మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయని పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు అన్నారు. ఈ నెల ఒకటి నుంచి నాలుగో తేదీ వరకూ జరిగిన ఏపీ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్–2026లో పతకాలు సాధించిన పోలీస్ సిబ్బందిని బుధవారం సీపీ రాజశేఖరబాబు అభినందించారు. ఈ సంద ర్భంగా పతకాలు సాధించిన క్రీడాకారులను వ్యక్తి గతంగా కలిసి వారి పతకాలను, ప్రశంసా పత్రాలను పరిశీలించి అభినందనలు తెలిపారు. అనంతరం సీపీ రాజశేఖరబాబు మాట్లాడుతూ.. విధి నిర్వహణలో నిరంతరం బిజీగా ఉండే పోలీస్ సిబ్బంది క్రీడా పోటీల్లో పాల్గొని గొప్ప ప్రతిభ కనబరిచి పతకాలు సాధించడం అభినందనీయమన్నారు. రాష్ట్ర స్థాయి స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్‌లో వివిధ విభాగాల్లో 74 పతకాలు సాధించి జిల్లా పోలీస్ కమిషనరేట్ పేరును నిలబెట్టిన ప్రతి క్రీడాకారునికి శుభాకాంక్షలు తెలిపారు. భవిష్య త్తులో కూడా ఇదే ఉత్సాహంతో మరిన్ని జాతీయ, రాష్ట్ర స్థాయి పోటీల్లో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఈస్ట్ డీసీపీ కృష్ణకాంత్ పటేల్, ఇతర డీసీపీలు కె.జి.వి.సరిత, ఎ.బి.టి.ఎస్.ఉదయరాణి, కె.కృష్ణప్రసన్న, సత్యనారాయణ, ఏడీసీపీ ఎన్.వి.రమణ, ప్రేమ్‌కుమార్, ఆర్‌ఐలు శ్రీనివాస్ శ్రీకాంత్, సుధాకర్‌రెడ్డి, పోలీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సోమయ్య తదితరులు పాల్గొన్నారు.
పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు


