భారతీయ హ్యూమన్‌ రైట్స్‌ కమిషన్‌ కార్యవర్గం ఏకగ్రీవం | - | Sakshi
Sakshi News home page

భారతీయ హ్యూమన్‌ రైట్స్‌ కమిషన్‌ కార్యవర్గం ఏకగ్రీవం

Sep 10 2026 3:44 AM | Updated on Sep 10 2026 3:44 AM

భారతీయ హ్యూమన్‌ రైట్స్‌ కమిషన్‌ కార్యవర్గం ఏకగ్రీవం

మధురానగర్‌(విజయవాడసెంట్రల్‌): భారతీయ హ్యూమన్‌ రైట్స్‌ కమిషన్‌ ఎన్టీఆర్‌ జిల్లా నూతన కార్యవర్గం ఏకగ్రీవమైంది. బీహెచ్‌ఆర్‌ఎస్‌ సెంట్రల్‌ కమిటీ హాల్‌లో బుధవారం భారతీయ హ్యూమన్‌ రైట్స్‌ కమిషన్‌ సర్వసభ్య సమావేశం జరిగింది. ఏపీ రాష్ట్ర బోర్డు సభ్యుడిగా విజయవాడ బాప్టిస్ట్‌నగర్‌కు చెందిన సిరివెళ్ల సంతోష్‌కుమార్‌ను, ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షుడిగా ప్రత్తిపాటి సంపత్‌కుమార్‌, ఉపాధ్యక్షుడిగా మల్లుల మోహన్‌కుమార్‌, ప్రధాన కార్యద ర్శిగా వెలితోటి డానియేలు, కో ఆర్డినేటర్‌గా పొలిమెట్ల జోసఫ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా బీహెచ్‌ఆర్‌ఎస్‌ నాయకులు మాట్లా డుతూ.. మానవ హక్కుల పరిరక్షణకు కమిషన్‌ కృషి చేస్తోందన్నారు. ఎక్కడ మానవ హక్కుల ఉల్లంఘన జరిగినా స్వయంగా పరిశీలించి బాధితులకు న్యాయం జరిగేలా కృషిచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ చైర్మన్‌ జబహర్‌లాల్‌ ఓజా, జాతీయ అధ్యక్షుడు పుల్లెల నాగేశ్వరరావు, రాష్ట్ర అధ్యక్షుడు ఇమ్మానియేల్‌, ప్రధాన కార్యదర్శి జాన్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement