న్యూస్‌రీల్
గన్నవరం విమానాశ్రయ విస్తరణలో ఇళ్లు కోల్పోయిన వారి బాధలు వర్ణనాతీతం ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ అపహాస్యం గత ప్రభుత్వం మంజూరు చేసిన నిధులనూ విడుదల చేయని చంద్రబాబు సర్కారు రెండేళ్లుగా పైసా విదల్చని వైనం తమ గోడు వినాలని విన్నవించుకుంటున్న బాధితులు
పాలకులు పట్టించుకోవాలి..
అద్దె బకాయిలు కూడా చెల్లించడం లేదు..
ఎన్టీఆర్ జిల్లా
శనివారం శ్రీ 29 శ్రీ ఆగస్టు శ్రీ 2026
నిర్వాసితుల కన్నీటి గాథలు వినేదెవరు?
7
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మను అయోధ్య బాల రాముని విగ్రహ శిల్పి అరుణ్ యోగిరాజ్ తన మిత్ర బృందంతో కలిసి శుక్రవారం దర్శించుకున్నారు. అధికారులు అమ్మవారి శేషవస్త్రాలు, ప్రసాదాలను అందజేశారు.
చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా కలెక్టరేట్ లోని ఈవీఎం గోడౌన్‌ను శుక్రవారం కలెక్టర్ డీకే బాలాజీ తనిఖీ చేశారు. గోడౌన్‌కు వేసిన సీళ్లను, సెక్యూరిటీ, సీసీ కెమెరాల పనితీరు పరిశీలించారు.
దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల గిరి ప్రదక్షిణ మహోత్సవం శుక్రవారం కనుల పండువగా సాగింది. ఉత్సవమూర్తులకు భక్తులు హారతులిచ్చి స్వాగతించారు.
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ పంచహారతుల సేవలో ఒడిశా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హరీష్ టాండన్ శుక్రవారం పాల్గొన్నారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన జస్టిస్ హరీష్ టాండన్‌కు ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. పంచహారతుల సేవలో పాల్గొన్న అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. వేద పండితుల ఆశీర్వచనం అందజేయగా, ఆలయ చైర్మన్ రాధాకృష్ణ, ఈవో శీనానాయక్ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, పట్టు వస్త్రాలను బహూకరించారు.
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాఖీ పౌర్ణమి పండుగను పురస్కరించుకుని మహిళా అధికారులు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశకు రాఖీ కట్టారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయానికి వచ్చి, మిఠాయి అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ రాఖీ పండుగ అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ఉన్న ప్రేమ, ఆత్మీయత, పరస్పర గౌరవానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. మహిళలకు సమాన అవకాశాలు, గౌరవం, భద్రత కల్పించడం ప్రతిఒక్కరి బాధ్యత అని అన్నారు. రాఖీ పండుగ స్ఫూర్తితో పరస్పర ప్రేమ, గౌరవం, సోదరభావంతో సమాజంలో సానుకూల వాతావరణాన్ని పెంపొందించుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
ఆస్తులు తీసుకున్నారు..
గన్నవరం: కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే విమానాశ్రయ విస్తరణలో ఇళ్లు కోల్పోయిన నిర్వాసితుల సమస్యలను తక్షణం పరిష్కరిస్తాం.. ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ స్థలంలో మౌలిక సదుపాయాలు కల్పించి, గృహ నిర్మాణాలు చేసుకునేందుకు అవసరమైన నిధులు మంజూరు చేస్తామని పచ్చ పార్టీ నేతలు గత ఎన్నికల ముందు హామీలు గుప్పించారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వాసితుల సమస్యలను గాలికి వదిలేశారు. ప్రభుత్వం పగ్గాలు చేపట్టి రెండేళ్లు గడుస్తున్నప్పటికీ నిర్మాసితులకు కేటాయించిన స్థలంలో ఎటువంటి సదుపాయాలు కల్పించలేదు. ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ కోసం గత రెండు బడ్జెట్ సమావేశాల్లో నిధులు కేటాయించినప్పటికీ.. ఇప్పటి వరకు పైసా నిధులు విడుదల చేయలేదు. కనీసం అద్దె బకాయిలు కూడా ప్రభుత్వం చెల్లించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ గోడును ప్రజాప్రతినిధులు, అధికారులు సైతం పట్టించుకోవడం లేదని వారు వాపోతున్నారు. ఫలితంగా గత పదేళ్లుగా అరకొర వసతుల మధ్య పెరిగిన కుటుంబాలతో సర్దుకుంటూ పాత ఇళ్లలోనే జీవనం సాగిస్తున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పదేళ్లుగా ఎదురుచూపులు..
విమానాశ్రయ విస్తరణ కోసం 2016లో దావాజీ గూడెం, అల్లాపురం, బుద్ధవరం గ్రామాల్లో 423 కుటుంబాలకు చెందిన ఇళ్లు, స్థలాలను సేకరించేందుకు ప్రభుత్వం గుర్తించింది. వీరికి ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ కింద గృహ నిర్మాణాలు చేపట్టేందుకు చిన్న అవుటపల్లి పరిధిలో 51 ఎకరాల భూమిని సమీకరించారు. అయితే సదరు భూమిలో అరకొరగా మెరక చేసిన అప్పటి టీడీపీ ప్రభుత్వం నిర్వాసితులకు ప్లాట్లు కూడా కేటాయించలేదు.
అనంతరం 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నిర్వాసితులకు అన్ని రకాల అండగా నిలిచింది. లాటరీ పద్ధతిలో ఐదు సెంట్ల చొప్పున ప్లాట్లు కేటాయించడంతో పాటు స్టాంప్ డ్యూటీ మినహాయించి ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి నిర్వాసితులకు దస్తావేజులను అందజేసింది. నిర్వాసితుల గృహ నిర్మాణాలకు రెండు విడతలుగా రూ.9లక్షల చొప్పున సాయంతో సహా రోడ్లు, డ్రెయిన్లు, తాగునీటి, విద్యుత్ వంటి మౌలిక వసతుల కల్పనకు రూ.80.48కోట్ల నిధులు కేటాయించింది. తీరా ఎన్నికల కోడ్ రావడంతో నిధులు విడుదల ప్రక్రియ నిలిచిపోయింది.
రూ. లక్షల్లో అద్దె బకాయిలు..
ఏడేళ్ల క్రితం ఎయిర్‌పోర్ట్ మైక్రో కెనాల్ కోసం దావాజీగూడెంలోని ఎస్సీ కాలనీలో 54 కుటుంబాలకు చెందిన గృహాలను ఖాళీ చేయించారు. వీరికి ఏడాదికి రూ. 50వేలు చొప్పున ప్రభుత్వం అద్దె చెల్లించే విధంగా ఒప్పందం చేసుకుంది. వీరికి అద్దె బకాయిలు కూడా సక్రమంగా చెల్లించకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక్కొక్క కుటుంబానికి సుమారు రూ. నాలుగు లక్షల వరకు ప్రభుత్వం బకాయిలు చెల్లించాల్సి ఉందని నిర్వాసితులు చెబుతున్నారు.
మంజూరు కాని నిధులు..
తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనలో ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ విషయంలో అడుగు ముందుకు పడక పోవడంతో నిర్వాసితుల్లో మళ్లీ ఆందోళన మొదలైంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం కేటాయించిన నిధుల విడుదలను కూడా నిలిపివేశారు. ఈ ఏడాది బడ్జెట్‌లో ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీకి రూ.32కోట్లు కేటాయించి నెలలు గడుస్తున్నా ఫలితం లేదు. రోడ్లు, డ్రెయిన్లు, తాగునీరు, విద్యుత్ వంటి కనీస సదుపాయాలు కూడా కల్పించడం లేదని నిర్వాసితులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ స్థలంలో పిచ్చి మొక్కలు, ముళ్ల చెట్లు దట్టంగా పెరిగి అడవిని తలపిస్తోంది. నిర్వాసితుల్లో అత్యధిక మంది ఎస్సీ, బీసీ వర్గాలకు చెందిన వారే ఉన్నారు.
ఈ ప్రాంత అభివృద్ధిని కాంక్షిస్తూ విమానాశ్రయ విస్తరణ కోసం తమకు వారసత్వంగా వచ్చిన ఇళ్లు, స్థలాలను ప్రభుత్వానికి ఇచ్చేందుకు ముందుకు వచ్చాం. ప్రత్యామ్నాయంగా ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ కింద గృహ నిర్మాణాలు చేసి న్యాయం చేస్తామని చెప్పారు. ఇంత వరకు గృహ నిర్మాణ ప్రక్రియ ప్రారంభం కాలేదు. దీనివల్ల ఉన్న ఇళ్లను కోల్పోయి అద్దె ఇళ్లలో బతుకుతున్నాం. ప్రజాప్రతినిధులు, అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదు. – టి. యేసురత్నం. ఎస్సీ కాలనీ, దావాజీగూడెం
విమానాశ్రయ విస్తరణలో ఇళ్లు కోల్పోయిన నిర్వాసితుల గోడును ఎవరూ పట్టించుకోవడం లేదు. మైక్రో కెనాల్ నిర్మాణంలో మా ఇంటిని తొలగించడంతో గత ఆరేళ్లుగా కుటుంబంతో అద్దె ఇళ్లలో ఉంటున్నాం. ప్రభుత్వం ఏటా ఇస్తామని చెప్పిన అద్దె కూడా చెల్లించకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాం.
– ఎన్. కోటేశ్వరరావు, దావాజీగూడెం


