న్యూస్‌రీల్
చెరువులు, కుంటలే కాదు పంట కాలువలూ ఖాళీ పట్టణాల్లో కలుషితమవుతున్న తాగునీరు గ్రామాల్లో భూగర్భ జలాలు అడుగంటి ఎండిపోయిన బోర్లు
కలుషిత నీరు వస్తోంది
రికార్డులకు..
క్షేత్రస్థాయికి ఎంతో తేడా
వారంలో రెండు రోజులే..
పులిచింతల సమాచారం
ఎన్టీఆర్ జిల్లా
గురువారం శ్రీ 23 శ్రీ జూలై శ్రీ 2026
పట్టణాలు, గ్రామాలను వేధిస్తున్న తాగునీటి కొరత
7
బెజవాడ దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి పలువురు భక్తులు బుధవారం విరాళాలు సమర్పించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకున్నారు.
పెనుగంచిప్రోలు తిరుపతమ్మ వారికి బుధవారం అమ్మవారి సేవకురాలు పాపమాంబ వంశీకులైన ఆలయ అర్చకులు సారె సమర్పించి బోనాలు చెల్లించారు.
డీఆర్‌ఎం మోహిత్ సోనాకియా
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే అధికారులు, సిబ్బంది రోజువారీ విధుల్లో హిందీ తప్పనిసరి అని డీఆర్‌ఎం మోహిత్ సోనాకియా పేర్కొన్నారు. రైల్వే ఆడిటోరియంలో పట్టణ అధికార భాష అమలు కమిటీ (టీఓఎల్‌ఐసీ) సమావేశం బుధవారం జరిగింది. ముఖ్యఅతిథిగా టీఓఎల్‌ఐసీ చైర్మన్, డీఆర్‌ఎం మోహిత్ సోనా కియా హిందీ ప్రాముఖ్యత, అమలు కోసం చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. ప్రస్తుత కాలంలో హిందీ నేర్చుకోవడం గతం కంటే చాల సులభమని సూచించారు. ఇటు వంటి కార్యక్రమాలు, పోటీలు అధికారిక ఉత్తర ప్రత్యుత్తరాల్లో హిందీ వినియోగాన్ని పెంచేందుకు దోహదపడతాయని వివరించారు. రాజభాష అమలులో ఉన్నత ప్రమాణాలను సాధించేందుకు డివిజన్ నిరంతరం కృషిచేస్తూనే ఉంటుందని తెలిపారు. ఏడీఆర్‌ఎం పి.ఇ.ఎడ్విన్ మాట్లాడుతూ.. టీఓఎల్‌ఐసీ సమావేశంలో అన్ని విభాగాలు చురుగ్గా పాల్గొనడం అభినందనీయ మన్నారు. అధికార భాష అమలు, ప్రచారం కోసం రైల్వే చేపడుతున్న పలు కార్యక్రమాల గురించి ఆయన వివరించారు. అనంతరం సీనియర్ రాజభాష అధికారి హేమంత్ వాడేకర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా డివిజన్‌లో రాజభాష అమలు పురోగతిని వివరించారు. అనంతరం గత మార్చి పది నుంచి 12వ తేదీ వరకు విజయవాడలో నిర్వహించిన హిందీ ఉపన్యాసం, వ్యాస రచన, కవితా పఠనం, డ్రాఫ్టింగ్, వార్త పఠనం, క్విజ్, అంత్యా క్షరి పోటీల్లో 45 కేంద్ర ప్రభుత్వ క్యాలయాలకు చెందిన 276 మంది అధికారులు, ఉద్యోగులు పాల్గొనగా 63 మంది విజేతలకు డీఆర్‌ఎం చేతుల మీదుగా సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో పలు విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
సాక్షి, విజయవాడ: తాగునీటి సమస్య ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది. పల్లె, పట్టణం అన్న తేడా లేకుండా అన్ని ప్రాంతాల ప్రజలు తాగునీటికి కటకటలాడుతున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో సమస్య తీవ్రరూపం దాలుస్తున్నా పాలకులు, అధికారుల్లో చలనం రావడంలేదు. పంచాయతీలు, మునిసిపాలిటీ, నగరపాలక సంస్థల పాలకవర్గాల పదవీకాలం ముగిసింది. స్థానిక సంస్థలు అధికారుల ఏలుబడిలోకి వెళ్లాయి. ప్రత్యేక అధికారుల పాలనలో తాగునీటి సమస్య జటిలంగా మారింది. ఉమ్మడి జిల్లాలో ముఖ్య నగరమైన విజయవాడలో తాగునీటి సరఫరా కోసం ఏటా రూ.58 కోట్లకు పైనే ఖర్చు చేస్తున్నారు. అయినా స్వచ్ఛమైన నీరు అందడంలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇటీవల తాగునీరు కలుషితమైన కుళాయి నీటిని తాగి గిరిపు రంలో పలువురు స్థానికులు డయేరియా బారినపడ్డారు. గతేడాది సెప్టెంబర్‌లో న్యూరాజరాజేశ్వరి పేటలో నీరు 100 మందికి పైగా అతిసారం బారిన పడగా ఇద్దరు మృతి చెందారు. అయినా కార్పొరేషన్ నిర్లక్ష్యం వీడడం లేదన్న విమర్శలు ఉన్నాయి.
ఎన్టీఆర్ జిల్లా అంతటా అదే సమస్య
ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడ నగరపాలక సంస్థ, నాలుగు మునిసిపాలిటీలు, 321 పంచాయతీలు ఉన్నాయి. సుమారు 22.18 లక్షల మంది నివసిస్తున్నారు. చాలా ప్రాంతాల్లో తాగునీటి సమస్య తీవ్ర మైంది. జగయ్యపేట 29వ వార్డు ట్రెజరీ కార్యా లయం రోడ్డు పక్కన 15 రోజులుగా నీరు రావడం లేదు. ఇందిరాగాంధీ విగ్రహం వద్ద ఆర్టీసీ కాలనీకి వెళ్లే మెయిన్ పైపులైన్ ఎనిమిది చోట్ల లీకవుతోంది. రెండేళ్లుగా మరమ్మతులు చేయాలని కోరుతున్నా అధికారులకు పట్టడంలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. నందిగామలో రెండు, మూడు రోజులకు ఒకసారి నీటి సరఫరా జరుగుతోంది. తిరువూరులో వారానికి ఒకసారి తాగునీరు సరఫరా చేస్తున్నారు. మైలవరం నియోజవర్గంలోని మైలవరం, జి.కొండూరు మండలాలు, తిరువూరు నియోజకవర్గంలోని విస్సన్నపేట, ఎ.కొండూరు మండలాలు, జగ్గయ్యపేట నియోజకవర్గంలోని వత్సవాయి మండలంలో తాగునీటికి ఇక్కట్లు తప్పడం లేదు.
కృష్ణా జిల్లాలో మరింత దుర్భరం
కృష్ణా జిల్లాలో మచిలీపట్నం కార్పొరేషన్‌తో పాటు గుడివాడ, పెడన, ఉయ్యూరు, తాడిగడప మునిసిపాలిటీలు, 502 గ్రామాల్లో 17.35 లక్షల మంది ప్రజలు నివసిస్తున్నారు. జిల్లా కేంద్రమైన మచిలీపట్నంతోపాటు గుడివాడ, పెడనలో రోజు మార్చి రోజు తాగునీటి సరఫరా జరుగుతోంది. కృత్తివెన్ను మండలంలో తాగునీటి సమస్య తీవ్రమైంది. గ్రామాల్లో గృహ అవసరాలకు వినియోగించే నీరు నెలలో రెండు లేదా మూడుసార్లకు మించి సరఫరా కావడం లేదు. ఇటీవల కృత్తివెన్ను పంచాయతీ పల్లెపాలెంలో కుళాయిల ద్వారా రంగు మారి కలుషిత నీరు సరఫరా కావడంతో మహిళలు రోడ్డెక్కి నిరసన తెలిపారు. దీంతో ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ, డీఈ గ్రామంలో పర్యటించారు. ఇంతేరు నుంచి చిన్న గొల్లపాళెం వరకు సముద్ర తీరం ప్రాంతం కావడంతో తాగునీరు అందక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. బంటుమిల్లి మండలంలో కూడా ఇదే పరి స్థితి. ముఖ్యంగా చోరంపూడి, మల్లంపూడి గ్రామాల్లో తాగునీటికి తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. కూటమి ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు చుట్టపు చూపులా ఆయా నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు తప్పా క్షేత్రస్థాయిలో తమ సమస్యలను పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఎవరైనా నోరెత్తి సమస్య చెబితే అక్రమ కేసులు పెట్టి వేధిస్తుండడంతో తాగునీటి సమస్య చెప్పడానికి కూడా జనం భయపడుతున్నారు.
కృత్తివెన్ను మండలంలో తాగునీరు కలుషితం అవుతోంది. కలుషిత నీటివల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కృత్తివెన్ను పల్లిపాలెం గ్రామస్తులు నీరు దుర్వాసన వస్తోందని, పచ్చగా ఉంటోందని చెబితే వెళ్లాను. ఆ నీటిని తాగినా, స్నానాలు చేసినా రోగాలు వచ్చే ప్రమాదం ఉంది. ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు గ్రామంలో పర్యటించాక కొంతమేర సమస్య తగ్గింది. – మైల రత్నకుమారి,
జెడ్పీటీసీ సభ్యురాలు, కృత్తివెన్ను
మాకు కృష్ణా వాటర్ వారంలో రెండు రోజులు మాత్రమే వస్తోంది. అది కూడా ఎప్పుడు వస్తుందో తెలియక ఇబ్బంది పడుతున్నాం. తాగడానికి నీరు లేక మినరల్ వాటర్ తెచ్చుకోవాల్సి వస్తోంది. ఎండాకాలం పోయినా తాగు నీటి కష్టాలు తప్పడం లేదు. పైపులైన్లు బాగు చేసినప్పటికీ నీటి సమస్య తీరడం లేదంటే సమస్య ఎక్కడ ఉందో అధికారులే చెప్పాలి.
– రమావతు శ్రీను,
మునగపాడు గ్రామం జి.కొండూరు మండలం
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అధికారుల రికార్డుల ప్రకారం 7,846 చేతి పంపులున్నాయి. తాగు నీటి సమస్య పరిష్కారమంటూ ఏకంగా 7,746 పంపులకు మరమ్మతులు చేయించామని అధికా రులు రికార్డుల్లో చూపుతున్నారు. క్షేత్రస్థాయిలో నాలుగు వేల పంపులు కూడా పని చేయడం లేదు. చేతిపంపుల మరమ్మతుల పేరిట నందిగామ, తిరువూరు, మైలవరం, జగ్గయ్యపేట, పెనమలూరు, గన్నవరం నియోజకవర్గాల్లో పంచాయతీ కార్యదర్శులు నిధులు స్వాహా చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అచ్చంపేట : పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నీటి నిల్వ 29.3200 టీఎంసీలు. ప్రాజెక్టు దిగువకు విద్యుత్ ఉత్పత్తి నిమిత్తం 400 క్యూసెక్కులు వదులుతున్నారు.


