అధికారులు ఏం చేస్తున్నారు | - | Sakshi
Sakshi News home page

అధికారులు ఏం చేస్తున్నారు

Jul 13 2026 12:52 AM | Updated on Jul 13 2026 12:52 AM

అధికారులు ఏం చేస్తున్నారు స్పష్టత లేదు ●

సాగు నీరు విషయంలో అధికారులకై నా స్పష్టత ఉండాలి. వారు ఏం చేస్తున్నారు. ఎప్పుడు ఇచ్చేది, విత్తనాలు ఎప్పుడు వేసుకోవాలనే వాటి గురించి రైతులకు ముందుగా తెలియజేయాలి. అటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం చేయకపోవడం చాలా బాధకరం. పట్టిసీమ ద్వారా నీరు ఇచ్చేసామని, నీరు వస్తుందని అంటున్నారు. బంటుమిల్లి కాలువకు నీరు పూర్తిగా రావడం లేదు. దీంతో అనుసంధానంగా ఉన్న పంట కాలువలకు నీరు రాని దుస్థితి.

– కట్టా శ్రీనివాసరావు, రైతు, లంకలకలువగుంట, పెడన మండలం

రైతులు చాలా మంది వెదపద్ధతిలో నారుమడి వేసుకున్నారు. ఇప్పటికే చాలా సమయం గడిచిపోయింది. అదను దాటిపోయింది. రైతులను మొదటి నుంచి చంద్రబాబు ప్రభుత్వం మోసం చేస్తూనే ఉంది. విత్తనాలు సబ్సిడీ విషయంలో, అన్నదాత సుఖీభవ పథకంలోను, రైతులకు నష్టపరిహారం విషయంలో ఇలా అనేకమార్లు మోసం చేస్తూ వచ్చింది. ఇప్పుడు పంట ప్రారంభదశలోనే సాగునీటి విషయంలో ప్రభుత్వం దోబుచూలాడుతుంది.

– గరికపాటి చారుమతిరామానాయుడు, మార్కెట్‌ యార్డు మాజీ చైర్‌పర్సన్‌, పెడన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement