అకాల కష్టం | - | Sakshi
Sakshi News home page

అకాల కష్టం

Mar 20 2026 9:18 AM | Updated on Mar 20 2026 9:18 AM

అకాల కష్టం

వత్సవాయి మండలం మక్కపేటలో నేలవాలిన మొక్కజొన్న పంట

పెడన మండలం ఉరివి వద్ద మినుము కుప్పలు

లంకలకలువగుంట వద్ద మినుము పంటపై పరదాలు కప్పుతున్న రైతులు

ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా బుధ, గురువారం ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. గాలులు, వర్షం ధాటికి పలు పంటలకు తీవ్రంగా నష్టం వాటిల్లింది. మొక్కజొన్న పైరు పూర్తిగా నేలవాలింది. కల్లాల్లో ఆరబెట్టిన మిర్చి, నూర్పిడికి సిద్ధంగా ఉన్న మినుము పైర్లు వర్షానికి తడిశాయి. అరటి, మామిడి, బొప్పాయి తోటలు దెబ్బతిన్నాయి. పెనుగంచిప్రోలు మండలంలోని గుమ్మడిదుర్రు, వెల్దుర్తిపాడు, అనిగండ్లపాడు గ్రామాల్లో గింజ అంతా రాలిపోయి కేవలం వరి కంకులు మిగిలాయి.

– సాక్షి నెట్‌వర్క్‌

పెనుగంచిప్రోలులో కాపుదశలో విరిగిపడిన బొప్పాయి చెట్లు

ఇబ్రహీంపట్నం మండలం కొటికలపూడిలో నేలవాలిన మొక్కజొన్న చేను

ఘంటసాలలో వర్షానికి తడిసిన మినుము పంట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement