నేడు పెనుగంచిప్రోలుకు తిరుపతమ్మ పయనం
జగ్గయ్యపేట: పట్టణంలోని రంగుల మండపంలోని తిరుపతమ్మవారు, సహదేవతలు బుధవారం పెనుగంచిప్రోలుకు పయనమవనున్నారు. దాదాపు 24 రోజుల పాటు సాగిన రంగుల మహోత్సవం పూర్తి కావడంతో గోపయ్య సమేత తిరుపతమ్మ అమ్మవారితో పాటు మల్లయ్య, చంద్రమ్మ, కల్యాణ ఉత్సవమూర్తులు తిరుపతమ్మ, గోపయ్య, వినుకొండ అమ్మవారు, ఉన్నవూరు అమ్మవారు, మద్దిరావమ్మ, గుర్రం విగ్రహాలు ప్రత్యేకంగా తయారు చేసిన పల్లకీల ద్వారా పయనమవనున్నాయి. తిరుపతమ్మ ఆలయ సిబ్బంది, పేట సర్కిల్ పోలీసులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
పయనం ఇలా..
విగ్రహాలు పల్లకీలపై ఉదయం ఆరు గంటలకు మండపం నుంచి బయలుదేరి పట్టణంలోని రంగు బజార్, రైతుబజార్, మున్సిపల్ కూడలి మీదుగా సాయంత్రం నాలుగు గంటలకు చిల్లకల్లుకు చేరుకుంటాయి. భక్తుల పూజలనంతరం తిరిగి రాత్రి తొమ్మిది గంటలకు వత్సవాయి మండలం భీమవరం చేరుకుని అర్ధరాత్రి అక్కడి నుంచి బయలుదేరి 29న ఉదయం లింగగూడెం చేరుకుంటాయి. అక్కడి నుంచి 30న తెల్లవారుజాముకు పెనుగంచిప్రోలు ఆలయానికి వస్తాయి. విజయవాడ డీసీపీ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ముగ్గురు సీఐలు, 10 మంది ఎస్‌ఐలతో పాటు 150 మంది సిబ్బంది షిఫ్టుల ప్రకారం బందోబస్తు నిర్వహిస్తారు. అమ్మవారు వెళ్లే రూట్‌లను కూడా పోలీసులు పరిశీలించారు. పల్లకీల వెంట ఫైర్ ఇంజిన్, సెక్యూరిటీ, వైద్య సిబ్బంది ఉండనున్నారు.
విజయవాడ కల్చరల్: గాంధీనగర్‌లోని హనుమంతరాయ గ్రంథాలయంలో నిర్వహిస్తున్న డాక్టర్ నందమూరి తారక రామారావు కళాపరిషత్ వారి 9వ నాటికోత్సవాలు వైవిధ్య భరితంగా సాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, భాషా సాంస్కృతిక శాఖ, తపస్వి కల్చరల్ ఆర్ట్స్, కొడాలి బ్రదర్స్, ఆంధ్రనాటక కళాసమితి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో మంగళవారం బీవీకే క్రియేషన్స్ కాకినాడ వారి ‘కన్నీటికి విలువెంత’ నాటికను ప్రదర్శించారు. మూల కథ డి. కామేశ్వరి నాటకీకరణ డి. ఉమాశంకర్, దర్శకత్వం డి. వినయ్, రెండో నాటికగా మైత్రి కళానియం విజయవాడ వారి ‘వాస్తవం’ నాటికను ప్రదర్శించారు.
తెలుగు నాటకం వెలుగు దివ్వె..
ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆంధ్రనాటక కళాసమితి అధ్యక్షుడు నన్నపనేని నాగేశ్వరరావు మాట్లాడుతూ తెలుగు నాటకం వెలుగుతున్న దివ్వె అన్నారు. నూతన దర్శకులు, నాటకాలు రావల్సిన అవసరముందన్నారు. కార్యక్రమంలో తపస్వి కల్చరల్ ఆర్ట్స్ గౌరవాధ్యక్షుడు వేమూరి నాగేశ్వరశర్మ, న్యాయవాది వేముల హజరత్తయ్య గుప్తా తదితరులు పాల్గొన్నారు. అభ్యుదయ రచయితల సంఘం సభ్యుడు వల్లూరి శివప్రసాద్‌కి 2026 సంవత్సరానికి గానూ కళా తపస్వీ పురస్కారం అందజేశారు.
నేడు పెనుగంచిప్రోలుకు తిరుపతమ్మ పయనం
నేడు పెనుగంచిప్రోలుకు తిరుపతమ్మ పయనం


