
ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై వరలక్ష్మీ వత్రాలు ఘనంగా నిర్వహించారు. శ్రావణ మాసంలో అరుదుగా వచ్చే 5వ శుక్రవారం ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను దర్శించుకునేందుకు పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఐదో శుక్రవారం పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలను ఆచరించారు. మహా మండపం ఆరో అంతస్తులో వేదికపై అమ్మవారి ఉత్సవమూర్తికి పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం వరలక్ష్మీ వ్రతాలు జరుపుకొన్నారు. రూ. 1500 టికెటుపై ఆర్జిత సేవగా నిర్వహించిన వరలక్ష్మీ వ్రతంలో 87 మంది మహిళలు పాల్గొన్నారు. అనంతరం ఉచిత సేవగా నిర్వహించిన వరలక్ష్మీ వ్రతంలో 570కి పైగా మహిళలు అమ్మవారికి పూజలు జరిపించుకున్నారు. వీరిని రూ.100 క్యూలైన్‌లో అమ్మవారిని దర్శించుకునేందుకు అనుమతించారు. సర్వ దర్శనానికి రెండు గంటల సమయం పట్టగా భక్తుల రద్దీ నేపథ్యంలో దర్శన టికెట్లను రద్దు చేశారు.

ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు