నర్సింగ్‌ వృత్తి పవిత్రమైంది | - | Sakshi
Sakshi News home page

నర్సింగ్‌ వృత్తి పవిత్రమైంది

Mar 22 2025 2:02 AM | Updated on Mar 22 2025 1:57 AM

గన్నవరం రూరల్‌: నర్సింగ్‌ వృత్తి పవిత్రమైనదని, ఒత్తిడిని జయించి నర్సింగ్‌ వృత్తిలో రాణించాలని ఏపీ నర్సింగ్‌ కౌన్సిల్‌ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ కె.సుశీల సూచించారు. మండలంలోని చిన అవుటపల్లి డాక్టర్‌ సి. శోభనాద్రి సిద్ధార్థ నర్సింగ్‌ అండ్‌ స్కూల్‌ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన రాష్ట్ర స్థాయి నర్సింగ్‌ కాన్ఫరెన్స్‌కు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన వర్క్‌ షాప్‌ను ఉద్ధేశించి ఆమె మాట్లాడుతూ అసాధారణ ఒత్తిడి ఉద్యోగ జీవితంలో ప్రభావితం చేయరాదన్నారు. సెల్‌ఫోన్‌, సోషల్‌ మీడియా ప్రభావంతో మానవ సంబంధాలు విచ్ఛిన్నం అవుతున్నాయని, బాధ్యతాయుత వృత్తిలో ఉన్న నర్సులు వీటికి దూరంగా ఉండాలన్నారు. ఒత్తిడిని జయించేందుకు మార్గాలను వివరించారు. ప్రముఖ మానసిక వైద్య నిపుణుడు డాక్టర్‌ ఇండ్ల రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ నర్సులు చిరునవ్వుతో సేవలందించాలన్నారు. రోగులను నిరంతరం కనిపెట్టుకుని ఉండేది నర్సులేనన్నారు. రాష్ట్రంలోని 18 నర్సింగ్‌ కళాశాలల నుంచి విద్యా ర్థులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు వర్క్‌ షాప్‌నకు హాజరయ్యారు. రిసోర్స్‌ స్పీకర్స్‌గా సిస్టర్‌ ఫ్లోరెన్స్‌, కోటేశ్వరమ్మ, ప్రిన్సిపాల్‌ జె.వందన, డాక్టర్‌ ఝాన్సీ రాణి వ్యవహరించారు. మెడికల్‌ కళాశాల డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ సి.నాగేశ్వరరావు, డైరెక్టర్‌ డాక్టర్‌ సీవీ రావు, ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ భీమేశ్వర్‌, నర్సింగ్‌ కళాశాల కన్వీనర్‌ వి.శశికళ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి.

ఏపీ నర్సింగ్‌ కౌన్సిల్‌ రిజిస్ట్రార్‌ సుశీల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement