గాంధీనగర్(విజయవాడసెంట్రల్): జాతీయ విపతు్‌త్ నిర్వహణ సంస్థ, భారత్ స్కౌట్స్–గైడ్స్ సంస్థ కలిసి యువ ఆపద మిత్ర పథకం కింద యువతీయువకులకు శిక్షణ ఇవ్వనున్నట్లు స్టేట్ చీఫ్ కమిషనర్ ఎస్.సురేష్‌కుమార్, భారత్ స్కౌట్స్–గైడ్స్ స్టేట్ సెక్రటరీ జి.భానుముర్తిరాజు ఆదివారం సంయుక్త ప్రకటనలో తెలిపారు. వరదలు, భూకంపాలు, సునామీ వంటి ప్రకృతి వైపరిత్యాలు సంభవించినపుడు ఈ పథకం కింద జాతీయ విపత్తు నిర్వహణ సంస్థతో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగల యువతీయువకులకు ఏడురోజులపాటు ఈ శిక్షణ ఇవ్వనున్నట్లు వివరించారు. శిక్షణ పూర్తిచేసుకున్న వారికి అత్యవసర పరికరాలతో కూడిన కిట్ అందజేస్తామన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్నవారిక బీమా సదుపాయం కల్పిస్తున్నట్లు తెలిపారు. జిల్లావాసులై ఉండి, ఏడోతరగతి ఉత్తీర్ణతతోపాటు18 నుంచి 40ఏళ్లలోపు వయస్సు కలిగిన వారు ఈ శిక్షణకు అర్హులన్నారు. ఇది పూర్తిగా స్వచ్చందసేవ అని పేర్కొన్నారు. ఆసక్తిగల వారు జాతీయ విపత్తు నివా రణ సంస్థ వెబ్‌సైట్‌లో తమ పేర్లు నమోదు చేసుకోవాలని వారు సూచించారు.