సాఫ్ట్‌బాల్‌ చాంపియన్‌ ఆంధ్రా లయోల కళాశాల

విజయవాడరూరల్‌: నున్న వికాస్‌ కాలేజీలో రెండు రోజుల పాటు జరిగిన కృష్ణా యూనివర్సిటీ అంతర కళాశాలల పురుషుల సాఫ్ట్‌బాల్‌ చాంపియన్‌ షిప్‌ను ఆంధ్రా లయోలా కళాశాల జట్టు కై వసం చేసుకుంది. లీగ్‌లో లయోలా కాలేజి జట్టు మూడు మ్యాచ్‌లలో గెలుపొంది ప్రథమ స్థానంలో నిలవగా, నున్న వికాస్‌ బీపీఈడీ కాలేజీ రెండు మ్యాచ్‌లలో, ఏజీ అండ్‌ ఎస్‌జీ సిద్ధార్థ కాలేజీ ఒక్క మ్యాచ్‌లో గెలుపొంది రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. ఎస్‌ఆర్‌ఆర్‌ అండ్‌ సీవీఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నాలుగో స్థానంలో నిలిచింది. అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో విజేతలకు వికాస్‌ విద్యాసంస్థల కార్యదర్శి నరెడ్ల సత్యనారాయణరెడ్డి బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పోటీల్లో అత్యంత ప్రతిభ కనబర్చిన ఆంధ్రా లయోల జట్టు క్రీడాకారులను కృష్ణా యూనివర్సిటీ జట్టుకు ఎంపిక చేసినట్టు చెప్పారు. ఈ జట్టు వచ్చేనెల 5వ తేదీ నుంచి తొమ్మిది వరకు చండీగఢ్‌లోని పంజాబ్‌ యూనివర్సిటీలో జరగనున్న అఖిల భారత అంతర్‌ విశ్వవిద్యాలయాల పోటీల్లో పాల్గొంటుందన్నారు.

Read latest NTR News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top