వైఎస్సార్‌ 11వ వర్థంతి: ఆక్లాండ్‌లో రక్తదాన శిబిరం

YSR Vardhanthi YSRCP NRI NZ Blood Donation Camp - Sakshi

న్యూజిలాండ్‌ : మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి 11వ వర్ధంతిని పురష్కరించుకుని న్యూజిలాండ్‌ వైఎస్సార్‌ సీపీ ఎన్‌ఆర్‌ఐ విభాగం నివాళులు అర్పించింది. సెప్టెంబర్‌ 2వ తేదీన ఆనంద్‌ ఎద్దుల నాయకత్వంలో ఆక్లాండ్‌లో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆనంద్‌ ఎద్దుల, సుష్మిత చిన్నమలరెడ్డి, సమంత్‌ దాగెపూడి, శివ గండ, మనోజ్‌ అల్లం, విజయ్‌ ఆల్ల, గీతా ఇందూరి, ప్రణవ్‌ అన్నమరాజు, శ్రీనివాస్‌ గోట్ల, వినయ్‌ చంద్రపతి, శ్రద్ధా సాయిలు రక్తదానం చేశారు. న్యూజిలాండ్‌ వైఎస్సార్‌ సీపీ ఎన్‌ఆర్‌ఐ విభాగం సభ్యుల కృషిని ఏపీ ఉమెన్స్‌ కమిషన్‌ ఛైర్‌ పర్సన్‌ వాసిరెడ్డి పద్మ, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూధన్‌రెడ్డి, ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిలు అభినందించారు.

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top