న్యూజెర్సీలో వైఎస్సార్‌ జయంతి వేడుకలు: మహానేతకు ఘన నివాళి

Tribute to the Great Leader YSR Jayanthi Celebrations in New Jersey - Sakshi

న్యూ జెర్సీ: డాక్టర్ వై ఎస్ రాజశేఖర రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో న్యూ జెర్సీలో మన్రోలో థాంప్సన్ పార్కులో వైస్సార్ జయంతిని ఘనంగా నిర్వహించారు. జులై పదిన  జరిగిన  కార్యక్రమంలో ప్రెసిడెంట్  ఆళ్ళ రామిరెడ్డి, డాక్టర్ రాఘవ రెడ్డి , హరి వెళ్కూర్, అన్నారెడ్డి, రఘురామి రెడ్డి, ప్రభాకర్ చీనేపల్లి, రామమోహన్ రెడ్డి ఎల్లంపల్లి, సత్య పాతపాటి, ద్వారక వారణాసి, సహదేవ్ రెడ్డి, భానోజీ రెడ్డి, నగేష్ ముక్కమల్లతో పాటు పలువురు వై ఎస్సార్ అభిమానులు పాల్గొన్నారు. 

డా. వై.ఎస్‌.రాజశేఖర రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో వివిధ రాష్ట్రాలలో వైఎస్సార్ జయంతి జరుపుకోవడం ఆయనకిచ్చే ఘన నివాళి  అని  ఆళ్ళ రామిరెడ్డి అన్నారు.  వైఎస్సార్‌ను స్మరించుకుంటూ ఫౌండేషన్ తరపున వాటర్ ప్లాంట్స్, హెల్త్  క్యాంప్స్, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్, మెడికల్ కిట్స్, కూరగాయల సరఫరా లాంటి ఎన్నో కార్యక్రమాల నిమిత్తం వైస్సార్ అభిమానులు ఈ రెండేళ్లలో రెండు కోట్లకు పైగా సహాయం చేశారన్నారు.

నాటా ప్రెసిడెంట్ డాక్టర్ రాఘవ రెడ్డి గోసల మాట్లాడుతూ వైఎస్సార్ పధకాలు ఎంతో మంది పేదలకు ఉపయోగపడితే ఆంధ్రప్రదేశ్  సీఎం వైఎస్ జగన్మోహన్‌ రెడ్డి  ఈ పథకాలతో పాటుగా ‘నాడు నేడు’, ఇంగ్లీష్ మీడియం మరింత సమర్ధ వంతంగా అమలుచేయడం గర్వకారణమన్నారు. వైఎస్సార్ అభిమానులు  ఉభయ  తెలుగు రాష్ట్రాలలో వున్నారని అందుకు ఉదాహరణే ఇక్కడకు వచ్చిన అభిమానులని ప్రభాకర్ చీనేపల్లి  పేర్కొన్నారు.

డా.మూలే రామమునిరెడ్డి రాసిన కవితను కృష్ణమోహన్ రెడ్డి చదివి వినిపించారు. ఇంకా ఈ కార్యక్రమంలో మనోహర్ కడివెటి, అనిల్ రెడ్డి, బాలకృష్ణ బోడిరెడ్డి, ఆళ్ళ బసివి రెడ్డి, బ్రహ్మానంద రెడ్డి  పాల్వాయి, చంద్ర రెడ్డి, ఇందిరా శ్రీరామ్ రెడ్డి, కోటి రెడ్డి, కృష్ణ కళ్ళం, లక్ష్మారెడ్డి, నాగరాజా రెడ్డి, నాగేంద్ర ముక్కమల్ల, నాగిరెడ్డి  భీమవరపు, నాగిరెడ్డి  ఉయ్యురు, నరేష్ అన్నం, పద్మనాభ రెడ్డి,  రామ్ వేమిరెడ్డి, సంజీవ రెడ్డి బెక్కం, శ్రీధర్ గుడేటి, శ్రీనివాస్  గుండేటి, సూరి తాడి, తాతా రెడ్డి, తిమ్మా రెడ్డి, విజయ్ గోలి, వీర ప్రతాప్ రెడ్డి, వెంకటరెడ్డి కాగితాల, వెంకట శివ మద్దిగపు, ఆళ్ళ వికాస్ రెడ్డి, వినయ్ వాసిలి, వినోద్ ఎరువతో పాటు 300కి పైగా అభిమానులు పాల్గొని మహానేతకు ఘన నివాళులర్పించారు.

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top