హ్యాట్సాఫ్‌ .. మనోజ్ఞ

Saint Michael Medical Centre Resident Doctor Monogja Ruth Prasad Raises Covid Reliefe Funds For Indians - Sakshi

అమెరికాలో మెడికల్‌ రెసిడెంట్‌గా పని చేస్తోన్న మనోజ్ఞ

ఇండియాలో కరోనా కల్లోలం చూసి చలించిన మనోజ్ఞ

గోఫర్‌మీ పేరుతో అమెరికాలో ఫండ్‌ రైజింగ్‌  

నెవార్క్‌ (న్యూజెర్సీ) : ఏదేశమేగిన ఎందుకాలిడినా పొగడరా నీ తల్లిభూమి భారతిని అన్నట్టుగా అమెరికా వెళ్లినా.. ఇండియా కోసం పరితపిస్తోంది వైద్య విద్యార్థి మనోజ్ఞ రూత్‌ ప్రసాద్‌. ఇండియాలో కరోనా సెకండ్‌ వేవ్‌ సృష్టించిన బీభత్సం చూసి చలించిపోయారు డాక్టర్‌ మనోజ్ఞ. దీంతో అమెరికాలో ఉంటూనే ఇండియాలో ఉన్న డాక్టర్లకు సాయం చేసేందుకు నిధులు సమీకరిస్తున్నారు. దీంతో పాటు కోవిడ్‌ పట్ల అవగాహన పెంచేందుకు అమెరికాలో పలు కార్యక్రమాలు మనోజ్ఞ చేపడుతున్నారు.

కోవిడ్‌ సాయం
 న్యూ జెర్సీలోని నెవార్క్‌లో ఉన్న సెయింట్‌ మైఖేల్‌ మెడికల్‌ సెంటర్‌లో మనోజ్ఞ  మెడికల్‌ రెసిడెంట్‌గా పని చేస్తోంది. ఇక్కడ ఉంటూనే ఇండియాలో ఉంటున్న వారి కోసం నిధుల సమీకరణ, అమెరికా ప్రజల్లో పట్ల  కోవిడ్‌​ అవగాహన పెంచే పనులు చేపడుతున్నారు.  దీని కోసం గోఫండ్‌మీ ఫేజ్‌ను క్రియేట్‌ చేశారు. కాలేజీలో తనతో పాటు పని చేస్తున్న డాక్టర్లు ,  విద్యార్థులు, అధ్యాపకులను ఒప్పించారు. అంతా కలిసి  మంగళవారం నెవార్క్‌లో ర్యాలీ నిర్వహించారు. హాస్పటిల్‌ నుంచి జేమ్స్‌ స్ట్రీట్‌ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. ఈ గోఫర్‌మీ ద్వారా ఇప్పటి వరకు 2,500 డాలర్ల నిధులు సేకరించగలిగారు. 

గోఫండ్‌మీ
‘గోఫండ్‌మీ పేజ్‌ ద్వారా మేము నిర్వహించిన ర్యాలీ వల్ల కోవిడ్‌ పట్ల ప్రజల్లో మరింత అవగాహన పెరుగుతుంది. అంతేకాకుండా ఇతరులకు సహాయ పడేందుకు ఎంతో మందికి స్ఫూర్తిని ఇస్తుంది’ అని డాక్టర్‌ మనోజ్ఞ రూత్‌ ప్రభు తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ఇండియాకు సాయం ఎంతో అవసరమని ఆమె అన్నారు. మెడికల్‌ లెర్నింగ్‌ ప్రాసెస్‌లో సోషల్‌ యాక్టివిజమ్‌ ఓ భాగమని ఇంటర్నల్‌ మెడిసిన్‌ ప్రోగ్రామ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ థియోడర్‌ డికోస్టా అభిప్రాయపడ్డారు. 

చదవండి : రాష్ట్రాభివృద్ధికి ఎన్నారైల బాసట

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top