బిపిన్ రావత్‌కు నివాళులు అర్పించిన ఎన్నారైలు

Sai Datta Peetham New Jersey Homage To Bipin Rawat - Sakshi

సాయి దత్త పీఠంలో ఘన నివాళి

న్యూ జెర్సీ: హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన భారత త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్‌కు న్యూజెర్సీలో సాయి దత్త పీఠం నివాళులు అర్పించింది. న్యూజెర్సీ ఎడిసన్‌లో  శివ, విష్ణు ఆలయంలో బిపిన్ రావత్ చిత్రపటం ముందు కొవ్వొత్తులు వెలిగించి నివాళులు అర్పించింది. బిపిన్ రావత్‌తో పాటు సైన్యం లో సేవలందించిన రిటైర్డ్‌ కల్నల్ వీరేంద్ర ఎస్ తవాతియాఈ కార్యక్రమానికి వచ్చారు. బిపిన్‌ రావత్ తో తనకున్న అనుబంధాన్ని ఆయన స్మరించుకున్నారు. వీర సైనికులకు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియచేసారు.

ఈ సందర్భంగా సాయి దత్త పీఠం నిర్వాహకులు రఘు శర్మ శంకరమంచి, న్యూ జెర్సీ పబ్లిక్ యుటిలిటీస్ చైర్మన్ ఉపేంద్ర చివుకుల, మాతా రాజ్యలక్ష్మి (స్పిరిట్యుయల్ గురు, కమ్యూనిటీ లీడర్), సాయి దత్త పీఠం బోర్డు సభ్యులు, ఆలయ భక్తులు, మాతృభూమి కోసం బిపిన్ రావత్ చేసిన సేవలను గుర్తు చేశారు. హెలికాప్టర్ ప్రమాదంలో బిపిన్ రావత్‌తో పాటు మరణించిన ఇతర సైనికులందరికీ నివాళులు అర్పించారు. బిపిన్ రావత్ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్టు రఘు శర్మ శంకరమంచి తెలిపారు.
 

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top