
మనం కొన్ని నగరాలను సందర్శించినప్పుడు.. అక్కడ రోడ్డుపక్కన గోడలపైన లేదా కొన్ని హోటల్‌లో ఆకర్షణీయమైన చిత్రాలు కనిపిస్తాయి. అవి చూడగానే ఆకట్టుకునే విధంగా ఉంటాయి. అంతగా ఆకట్టుకునే చిత్రాలు మాట్లాడితే?, వచ్చే అనుభూతి మాటల్లో చెప్పలేము. ఈ ఆలోచనకే న్యూజెర్సీలోని ఫ్రాంక్లిన్ పార్క్‌లోని ఒక రెస్టారెంట్ కార్యరూపం దాల్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వీడియోలో గమనించినట్లయితే.. రెస్టారెంట్‌కు విచ్చేసిన కస్టమర్లు గోడలపై ఉన్న చిత్రాలను మొబైల్ ఫోన్ కెమెరా ద్వారా చూస్తుంటే, కొన్ని బొమ్మలు డైలాగ్స్ చెబుతున్నాయి, మరికొన్ని డ్యాన్స్ వేస్తున్నాయి. ఇవన్నీ కస్టమర్లను మరో ప్రపంచంలోకి తీసుకెళ్తున్నాయి. భారతీయ వంటకాలను ఆస్వాదిస్తూ.. ఇండియన్ సినిమా డైలాగ్స్ కూడా వినవచ్చు.