అయోధ్యలో రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన: డల్లాస్‌లో పండుగ వాతావరణం! | Ram Lalla Statue Installation In Ayodhya: Festive Atmosphere In Dallas | Sakshi
Sakshi News home page

అయోధ్యలో రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన: డల్లాస్‌లో పండుగ వాతావరణం!

Jan 23 2024 3:26 PM | Updated on Jan 23 2024 3:26 PM

Ram Lalla Statue Installation In Ayodhya: Festive Atmosphere In Dallas - Sakshi

అయోధ్యలో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. నూతనంగా నిర్మించిన రామమందిరంలో బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపణ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన సందర్భంగా అమెరికాలో పండుగ వాతవరణం నెలకొంది. అయోధ్య ఆలయ ప్రారంభోత్సవ వేళ డల్లాస్‌లోని ఇస్కాన్ ఆలయంలో వేడుకలు నిర్వహించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు, ఉత్సవాలను నిర్వహించారు.

ప్రవాసులు భారీగా తరలివచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ రాధా కళాచంద్ జీ ఆలయం రామ నామ జపంతో మార్మోగింది. ఇక భారతీయ సంప్రదాయాలు ఉట్టిపడేలా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. రామ భజనలు, కీర్తనలతో ప్రవాసులు ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇక ఆలయంలో నెయ్యి దీపాలు వెలిగించారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు భక్తి శ్రద్ధలతో దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. డల్లాస్ ఇస్కాన్ టెంపులలో దీపావళిని తలపించే విధంగా దీపోత్సవాల సంబరం అంబరాన్ని తాకింది.

(చదవండి: ఆఫ్రికాలో ఉద్యోగం.. ఎక్కడున్నా పండగకు ఇంటికొస్తే ఆ ఆనందమే వేరు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement