విదేశీ గడ్డపై వెలిగిన ఖ్యాతి.. న్యూయార్క్‌ వీధికి రామ్‌లాల్‌ పేరు

New York Street Renamed As Pandit Ramlall - Sakshi

మన ఖ్యాతి మరోసారి విదేశీ గడ్డపై వెలిగింది. న్యూయార్క్‌లో ఓ వీధికి భారత మూలాలున్న వ్యక్తి పేరును పెట్టారు. ప్రముఖ మత గురువు, భాషా పండితుడు ‘ధర్మాచార్య’ పండిట్‌ రామ్‌లాల్‌ పేరుతో ఓ వీధికి నామకరణం చేయగా, క్వీన్స్‌ రిచ్‌మండ్‌ హిల్‌లో అధికారిక వేడుక నిర్వహించారు.

గుయానా స్కెల్‌డాన్‌లో భారత మూలాలు ఉన్న కుటుంబంలో పుట్టి పెరిగారు రామ్‌లాల్‌. ఆయన అక్కడ స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారు. 1979లో అమెరికా బ్రూక్లిన్‌కు వెళ్లి అక్కడో ఆస్పత్రిలో పని చేశారు. ఇండో-కరేబియన్‌ కమ్యూనిటీ లీడర్లలో ఒకరిగా ఎదిగారు. ఆర్య సమాజం తరపున పనిచేశారు. ముఖ్యంగా హిందీ భాషాభివృద్ధికి ఎంతో కృషి చేశారు. గుయానాలో ఉన్నప్పుడు టాగూర్‌ మెమొరియల్‌ స్కూల్‌లో భారతీయ విద్యార్థులకు హిందీ బోధించేవారాయన. 2019లో 90 ఏళ్ల వయసులో ఆయన కన్నుమూశారు.

లిబర్టీ అవెన్యూ, 133వ వీధికి రామ్‌లాల్‌ పేరు పెట్టాలని ఇండో-కరేబియన్స్‌ నుంచి ప్రతిపాదనలు రాగా,  జూన్‌ 27న న్యూయార్క్ మేయర్‌ బిల్‌ డె బ్లాసియో సంతకం చేశారు. దీంతో వీధికి రామ్‌లాల్‌గా నామకరణం పూర్తికాగా, అట్టహాసంగా జరిగిన ప్రారంభ వేడుకలో న్యూయార్క్‌ సిటీ కౌన్సిల్‌ అడ్రిన్నె అడమ్స్‌ పాల్గొన్నారు. ఇంతకు ముందు న్యూయార్క్‌లో రమేశ్‌ కాళిచరణ్‌ వే, జోనాథన్‌ నారాయిన్‌ వే, పంజాబ్‌ అవే, గురుద్వారా వే, లిటిల్‌ గుయానా అవెన్యూలుగా కొన్ని వీధులకు పేర్లు పెట్టారు.

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top