ప్రాణాలకు తెగించి విధులు నిర్వర్తిస్తున్న పోలీసులు

NATS Sponsored Lunch Boxes To Cops In Florida - Sakshi

టెంపాబే, ఫ్లోరిడా:  ప్రాణాలకు తెగించి సేవలందించే కాప్స్‌ (పోలీసులు)ను ప్రోత్సహించేలా ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్  లంచ్ బాక్సులు అందించింది. టెంపాబే నాట్స్ విభాగం, ఐటీ సర్వ్ అలయన్స్ ప్లోరిడాతో కలిసి పాస్కో కౌంటీ షెరీఫ్‌లో కాప్స్/డిప్యూటీలకు 50 లంచ్ బాక్సులను ఇచ్చింది. గత కొన్ని సంవత్సరాలుగా నాట్స్ కాప్స్‌ను గౌరవిస్తూ.. వారిని ప్రోత్సాహించే విధంగా వారికి లంచ్ బాక్సులను అందిస్తూ వస్తుంది. కోవిడ్ సమయంలో ప్రాణాలకు తెగించి ఫ్రంట్ లైన్ వర్కర్లుగా వారు చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంది. నాట్స్ ఇలా కాప్స్‌ను ప్రోత్సాహించేలా లంచ్ బాక్సులు అందించడాన్ని స్థానిక అధికారులు ప్రశంసించారు. నాట్స్ చేపడుతున్న సేవా కార్యక్రమాలను తెలుసుకుని అభినందించారు. 

నాట్స్ మాజీ చైర్మన్ శ్రీనివాస్ గుత్తికొండ, నాట్స్ బోర్డు సెక్రటరీ ప్రశాంత్ పిన్నమనేని,  నాట్స్ ఫైనాన్స్/ మార్కెటింగ్  వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మల్లాది, జోనల్ వైస్ ప్రెసిడెంట్ రాజేశ్ కాండ్రు, ఎగ్జిక్యూటివ్ వెబ్ సెక్రటరీ సుధీర్ మిక్కిలినేని, నాట్స్ టెంపాబే కో ఆర్డినేటర్, ఐటీ సర్వ్ అలయన్స్ టెక్నాలజీ చైర్ ప్రసాద్ ఆరికట్ల, నాట్స్ టెంపాబే జాయింట్ కో ఆర్డినేటర్  సురేశ్ బొజ్జ, ఐటిసర్వర్ ఎఫ్ఎల్ చాప్టర్ ప్రెసిడెంట్ భరత్ ముల్పురు, భాను ధూళిపాళ్ళ, నాట్స్ కోర్ సభ్యులు సుమంత్ రామినేని, శిరిష దొడ్డపనేని, దీప్తి రాటకోండ, ప్రభాకర్ శాఖమూరి, రుత్విక్, రిష్వితా ఆరికట్ల తదితరులు ఈ కార్యక్రమానికి తమ వంతు సాయం అందించారు.
 

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top