డాలస్ విభాగం ఆధ్వర్యంలో ఫుడ్ ప్యాకెట్ల తయారు
డాలస్, టెక్సాస్: అమెరికాలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ .. ఆకలితో ఆలమటిస్తున్న పేద పిల్లలకు పోషకాహారం అందించేందుకు రంగంలోకి దిగింది. తాజాగా నాట్స్ డాలస్ విభాగం, ఫీడ్ మై స్ట్రావింగ్ చిల్డ్రన్‌లు కలిసి పేద పిల్లలకు ఆహారం అందించేందుకు కావాల్సిన ఆహారాన్ని సిద్ధం చేశాయి. రిచర్డ్‌సన్ నగరంలో దాదాపు 20 మంది తెలుగు యువతీ, యువకులు, పెద్దలు.. 133 బాక్సుల పౌష్టికాహారాన్ని ప్యాక్ చేశారు. ఇందులో 28,728 భోజనాలు సిద్ధం చేశారు. ఈ ప్రయత్నం ద్వారా 78 మంది పిల్లలకు ఒక సంవత్సరం పాటు పోషకాహారం అందించేలా ఫుడ్ ప్యాకింగ్ చేశారు. నాట్స్ పూర్వ అధ్యక్షులు, ప్రస్తుత నాట్స్ బోర్డు అఫ్ డైరెక్టర్ బాపు నూతి, నాట్స్ బోర్డ్ డైరెక్టర్ రాజేంద్ర మాదల మార్గదర్శకత్వంలో పలువురు నాట్స్ యువ వాలంటీర్లు కుటుంబ సమేతంగా పాల్గొని వేల సంఖ్యలో ఆహార కిట్లను సిద్ధం చేశారు
నాట్స్ డాలస్ చాప్టర్ యువతను ప్రోత్సహిస్తూ, పిల్లల్లో సేవాభావాన్ని పెంపొందించటానికి ఇలా పేద పిల్లలకు పౌష్టికాహారం సిద్ధం చేసే కార్యక్రమాన్ని చేపట్టిందని బాపు నూతి అన్నారు. సేవా కార్యక్రమాల్లో విద్యార్ధులను భాగస్వామ్యులను చేయటం చాలా సంతోషంగా ఉందని, ఇందులో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు అని రాజేంద్ర మాదల అన్నారు.

ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించిన పావని నున్న, సౌజన్య రావెళ్ల డాలస్ టీం సభ్యులకు డల్లాస్ చాప్టర్ కోఆర్డినేటర్లు స్వప్న కాట్రగడ్డ, శ్రావణ్ కుమార్ నిడిగంటిలు కృతజ్ఞతలు తెలిపారు.. ఈ సేవా కార్యక్రమంలో నాట్స్ జాతీయ జట్టు నుండి సహకోశాధికారి రవి తాండ్ర, మీడియా కోఆర్డినేటర్ కిషోర్ నారె, డల్లాస్ చాప్టర్ జట్టు నుండి పావని నున్న తదితరులు పాల్గొన్నారు. డాలస్ చాప్టర్ టీం, నాట్స్ సలహాదారు బృందం సభ్యుల సహకారంతో ఇంత మంచి సేవా కార్యక్రమం చేపట్టినందుకు నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని నాట్స్ అధ్యక్షులు శ్రీహరి మందాడి నాట్స్ డాలస్ విభాగానికి ప్రత్యేక అభినందనలు తెలిపారు.