ఫస్ట్‌ పేపర్‌లెస్‌ గవర్నమెంట్‌గా దుబాయ్‌.. ప్రజలకు ఇబ్బంది కలగకుండానే ఫీట్‌!

Dubai becomes first paperless government in the world - Sakshi

UAE City Dubai world's first govt to go 100% paperless: యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ దేశ నగరం దుబాయ్‌ చరిత్ర సృష్టించింది. ప్రపంచంలోనే మొట్టమొదటి 100 శాతం పేపర్‌లెస్‌ గవర్నమెంట్‌ ఖ్యాతి దక్కించుకుంది. ప్రభుత్వానికి సంబంధించి అన్ని రకాల సేవలను, ట్రాన్‌జాక్షన్స్‌ను ‘డిజిటల్‌ ఫార్మట్‌’లోనే కొనసాగిస్తూ.. ఈ ఘనత అందుకుంది దుబాయ్‌ నగరం.

వంద శాతం ‘పేపర్‌లెస్‌’ సాధించిన తొలి ప్రభుత్వంగా దుబాయ్‌ సిటీ నిలిచింది. ఈ మేరకు ఎమిరే​ట్స్‌ దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్‌దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ప్రకటించారు. తద్వారా 14 మిలియన్‌ గంటల మనిషి శ్రమను..  1.3 బిలియన్‌ దిర్‌హమ్‌(350 మిలియన్‌ డాలర్లు) ఆదా చేసినట్లు  పేర్కొన్నారాయన. 

ప్రభుత్వానికి సంబంధించి ఇంటర్నల్‌, బయటి ట్రాన్‌జాక్షన్స్‌తో పాటు.. ప్రభుత్వానికి సంబంధించి ప్రతీ సేవలను డిజిటల్‌ పద్దతిలో.. అదీ ప్రభుత్వ వేదికల మీదుగానే సాగిందని దుబాయ్‌ ప్రభుత్వం ప్రకటించుకుంది. మొత్తం 45 ప్రభుత్వ రంగాల్లో 1,800 రకాల డిజిటల్‌ సేవలను .. అదీ ఆలస్యం అవ్వకుండా డిజిటల్‌ ఫార్మట్‌లో ప్రజలకు చేరవేయడం విశేషం. ఈ క్రమంలో నగరవాసులపై ప్రభుత్వం ఏమాత్రం ఒత్తిడి చేయకుండా.. స్వచ్ఛందంగా ఈ ఘనత సాధించింది.

  

పేపర్‌లెస్‌ ఘనత ప్రపంచానికి డిజిటల్‌ క్యాపిటల్‌గా నిలవడానికి దుబాయ్‌కు ఎంతో ప్రొద్భలం ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు క్రౌన్‌ ప్రిన్స్‌. అంతేకాదు మరో ఐదు దశాబ్దాలపాటు అత్యాధునిక వ్యూహాలతో దుబాయ్‌లో డిజిటల్‌ లైఫ్‌ కొనసాగేలా ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారాయన. 

ఇదిలా ఉంటే అమెరికా(ఖండాలు), యూకే, యూరప్‌ దేశాల్లో ప్రభుత్వాలు ఈ తరహా విధానానికి మొగ్గు చూపించినప్పటికీ.. సైబర్‌ దాడుల భయంతో వెనక్కి తగ్గాయి. కానీ, దుబాయ్‌ మాత్రం ధైర్యం చేసి ముందడుగు వేసి.. ఈ ఫీట్‌ సాధించింది. ప్రభుత్వం చేపట్టిన డిజిటల్‌ మూమెంట్‌తో  336 మిలియన్‌ పేపర్లను, 1.3 బిలియన్‌ దిర్‌హమ్‌(350 మిలియన్‌ డాలర్లు) బడ్జెట్‌ను,  14 మిలియన్‌ గంటల ఉద్యోగుల శ్రమను మిగిల్చింది దుబాయ్‌ ప్రభుత్వం. ఇదిలా ఉంటే ప్రపంచంలో రిచ్చెస్ట్‌ సిటీల్లో ఒకటిగా ఉన్న దుబాయ్‌ జనాభా 35 లక్షలు కాగా.. మెట్రో ఏరియాలో జనాభా 29 లక్షలకు పైనే ఉంది.

చదవండి: అర్జెంటీనా టు అస్సాం వయా దుబాయ్‌..  ఖరీదు 20లక్షలకుపైనే!

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top