అమెరికా ప్రేక్షకులను మంత్రముగ్థులను చేసిన రుక్మిణి విజయకుమార్ | Donor Appreciation Event Conducted By Aim For Seva In Bay Area | Sakshi
Sakshi News home page

అమెరికా ప్రేక్షకులను మంత్రముగ్థులను చేసిన రుక్మిణి విజయకుమార్

Published Tue, Nov 14 2023 11:00 AM | Last Updated on Tue, Nov 14 2023 11:08 AM

Donor Appreciation Event Conducted By Aim For Seva In Bay Area - Sakshi

అమెరికా, బే ఏరియాలో AIM for Seva నిర్వహించిన Donor appreciation event 2023 గ్రాండ్ సక్సెస్ అయింది.  అనుభవ పేరుతో ఏర్పాటు చేసిన ఏకపాత్రాభినయ ప్రదర్శనకు అనుహ్య స్పందన వచ్చింది. సంప్రదాయ నృత్యరీతులు, వినసొంపైన సంగీతం, ఆలోచింపజేసే ఏకపాత్రాభినయ ప్రదర్శనతో కార్యక్రమం ఆద్యంతం ఆకట్టుకుంది.

శాంటా క్లారా కన్వెన్షన్ సెంటర్‌ వేదికగా జరిగిన ఈవెంట్ ఆడియన్స్‌ని కట్టిపేడేసింది. డాన్సర్, కొరియోగ్రాఫర్ రుక్మిణి విజయకుమార్..ఆలోచింపజేసే ఏకపాత్రాభినయ ప్రదర్శన ప్రేక్షకులను మంత్రముగ్థులను చేసింది.వయోలిన్ విద్వాంసుడు అంబి సుబ్రమణ్యం వాయిద్యాలతో ఆహుతులను ఆకట్టుకున్నారు.  AIM బే ఏరియా చాప్టర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం విజయవంతం అవటం పట్ల నిర్వహకులు ఆనందం వ్యక్తం చేశారు.

సంస్థ తరపున చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి రాణి గోయెల్‌ వివరించారు. నిరుపేద పిల్ల విద్య, వారి కలలను పెంపొందించేందుకు AIM for Seva కట్టుబడి ఉందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో రుక్మిణి విజయకుమార్, అంబి సుబ్రమణ్యం ఎంతో ఉత్సాహంగా లో పాల్గొని.. తమ ప్రతిభాపాటవాలను ప్రదర్శించిన తీరు ఔరా అనిపించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement