టీసీఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో ఘనంగా సింగపూర్ బోనాల జాతర | Bonalu 2025 Jatra Organised By Telangana Cultural Society Singapore | Sakshi
Sakshi News home page

టీసీఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో ఘనంగా సింగపూర్ బోనాల జాతర

Jul 14 2025 10:23 AM | Updated on Jul 14 2025 11:13 AM

Bonalu 2025 Jatra Organised By Telangana Cultural Society Singapore

‘తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్)’ ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల పండుగ వేడుకలు ఆదివారం (13 జూలై 2025) సాయంత్రం అత్యంత వైభవంగా జరిగాయి. వర్షం కారణంగా కొంత అంతరాయం ఏర్పడినప్పటికీ..భక్తులందరూ ఉత్సహంగా పాల్గొని బోనాల పండగని విజయవంతం చేశారు. భాగ్యనగరంలో ఉజ్జయిని మహంకాళి బోనాలు జరిగిన రోజున సింగపూరులో కూడా జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని సభ్యులు తెలిపారు. ఈ బోనాల వేడుకలను స్థానిక ‘సుంగే కేడుట్‌’ లోని శ్రీ అరసకేసరి శివాలయంలో  ఘనంగా జరుపుకున్నారు.

ప్రముఖ సెలెబ్రిటీ సంజయ్ తుమ్మ - వాహ్ చెఫ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సంజయ్ తుమ్మ గారి ఆట పాటలతో బోనాల ఊరేగింపులో అందరికీ ఉత్తేజాన్ని కలిగించారు. ఈ బోనాల ఊరేగింపులో పోతురాజులు, పులి వేషాలు, తొట్టెలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ వేడుకల్లో సింగపూర్‌లో ఉన్న తెలంగాణ ప్రాంతానికి చెందిన వారే కాకుండా.. తెలుగు వారందరితో తో కలిపి సుమారు 650 నుండి 750 మంది వరకు భక్తులు పాల్గొన్నారు. బోనాల ఊరేగింపులో అమ్మ వారి భక్తి మరియు బోనాలకు సంబందించిన ప్రత్యేక పాటలకు చిన్నా, పెద్ద తేడా లేకుండా అందరూ కలిసి ఆడిపాడారు. తెలంగాణ మహిళలు భక్తి శ్రద్ధలతో దుర్గాదేవికి బోనాలు సమర్పించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. ప్రజలందరికి  మహంకాళి తల్లి ఆశీస్సులు ఉండాలని టీసీఎస్‌ఎస్‌ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా టీసీఎస్‌ఎస్ వారు తొలిసారి 2017 లో బోనాల పండుగను నిర్వహించి సింగపూర్ కు ఈ పండుగ ప్రాముఖ్యతని పరిచయం చేసిన రోజులను గుర్తు చేసుకొని సంతోషించారు. మన ఈ తెలంగాణ సంప్రదాయం లో ప్రధాన భూమిక పోషించే బోనాల పండుగతో ప్రేరణ పొంది తెలుగు వారందరు బోనాల వేడుకను జరుపుకోవడం సంతోషకరం అని బోనాల్లో పాల్గొన్న వారు అన్నారు.



బోనాల జాతరలో పోతురాజు మరియు పులివేషాలతో జాతరకు కళ తెచ్చిన నేరెళ్ల శ్రీనాథ్, గౌడ లక్ష్మణ్, అయిట్ల లక్ష్మణ్, లక్ష్మిపతి, అరవింద్‌లకు  ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. ఈ ఏడాది బోనం సమర్పించిన ఫ్యామిలీస్ లో రమేష్ గడప, వివేక్ బుర్గోజు, శశిధర్ రెడ్డి, నిఖిల్ ముక్కావర్, సందీప్ రెడ్డి పుట్టా, శ్వేత కుంభం, శ్రీనివాస్ గర్రెపల్లి, అలేఖ్య తడిసిన, అలేఖ్య దార, బండ శ్రీ దేవి, అనిత రెడ్డి చాడ, చీర్లవంచ రాజు, మనోహర్ సల్లా, మోతే శ్రీనివాస రెడ్డి, వేముల సురేష్, హర్షిణి కషాబోయినా, రాధాకృష్ణ ఎం.వి.ఎస్., విజయ్ అనూష, దీపా రెడ్డి మండల ఉన్నారు. బోనం సమర్పించిన  భక్తులకు తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) వారు రిటర్న్ గిఫ్ట్ ను అందచేశారు. అమ్మవారికి బోనం సమర్పించిన భక్తులు ఇంట్లో వండి తెచ్చిన అన్న తీర్థ ప్రసాదాన్ని పంచి సంతోషాన్ని వెలిబుచ్చారు. వీరితో పాటు గడప రమేశ్ అమ్మవారి కోసం తొట్టెలను స్వయంగా పేర్చి తీసుకుకొచ్చారు.

బోనాలు పండుగ లో పాల్గొన్న భక్తులందరూ కమిటీ ఏర్పాటు చేసిన అన్న ప్రసాద (పులిహోర , పెరుగు అన్నం మరియు కేసరి ) వితరణలో పెద్ద ఎత్తులో సంతోషంగా పాల్గొని అందరూ అన్న ప్రసాదాన్ని స్వీకరించారు.  సింగపూర్ బోనాలు - 2025 పండుగలో పాల్గొని విజయవంతం చేసిన మరియు ఎల్లప్పుడూ సొసైటీ వెన్నంటే ఉండి సహకారం అందిస్తున్న ప్రతీ ఒక్కరికి  సొసైటీ అధ్యక్షులు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి రాము బొందుగుల మరియు కోశాధికారి నంగునూరి వెంకట రమణ , సొసైటీ  ఉపాధ్యక్షులు బసిక ప్రశాంత్ రెడ్డి, దుర్గ ప్రసాద్, భాస్కర్ గుప్త  నల్ల, జూలూరి సంతోష్ కుమార్ ఉపాధ్యక్షురాలు మిర్యాల సునీత రెడ్డి, సంస్థాగత కార్యదర్శి కాసర్ల శ్రీనివాస రావు, ప్రాంతీయ కార్యదర్శులు బొడ్ల రోజా రమణి, నడికట్ల భాస్కర్, శశిధర్ రెడ్డి, రవి కృష్ణ విజాపూర్,సంతోష్ వర్మ మాదారపు మరియు కార్యవర్గ సభ్యులు శివ ప్రసాద్ ఆవుల, పెరుకు శివ రామ్ ప్రసాద్, రవి చైతన్య మైసా,  భాస్కర్ రావు పులిగిళ్ల, విజయ మోహన్ వెంగళ, ప్రవీణ్ మామిడాల, సతీష్ పెసరు, మణికంఠ రెడ్డి, రావుల సుగుణాకర్ రెడ్డి, చల్ల కృష్ణ మొదలగు వారు మాట్లాడుతూ సొసైటీకి సహాయ సహకారాలు అందిస్తున్న సింగపూర్ లో ఉన్న తెలంగాణ వాసులకు, అందరూ తెలుగు వారికి  మరియు స్పాన్సర్స్ కు  పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు.అందరి పై ఉజ్జయిని మహంకాళీ ఆశీస్సులు ఉండాలని సొసైటి సభ్యులు ఆకాంక్షించారు.

ఎలాంటి తొక్కిసలాట జరగకుండా తీసుకున్న జాగ్రత్తలకు సొసైటీ చేసిన ఏర్పాట్లను భక్తులు అభినందించారు. ముఖ్య అతిథి సంజయ్ తుమ్మ - వాహ్ చెఫ్  గారిని సన్మానించి టిసి ఎస్ ఎస్ జ్ఞాపికను వారికి అందజేయడం జరిగింది. సంజయ్ తుమ్మ గారి ఆతిథ్యంలో సహకరించిన సూపర్ డీలక్స్ కిచెన్ యాజమాన్యానికి కమిటీ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు

ఈ వేడుకలకు సహకారం అందించిన సంపంగి రియాలిటి అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్, ఏ.ఎస్.బి.ఎల్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్, గారెంటో అకాడమీ, వజ్ర బిల్డర్స్ బిల్డింగ్ వాల్యూస్, మై హోమ్ గ్రూప్ కంస్ట్రక్షన్స్, అభిరామి జ్యూవెల్లర్స్, ఎవోల్వ్, సూపర్ డీలక్స్ కిచెన్ సరిగమ గ్రాండ్ రెస్టారెంట్ & బిస్ట్రో , జి.ఆర్.టి జ్యూవెల్లర్స్, చంద్రశేఖర్ దోర్నాల, నగేష్ టేకూరి, అజయ్ నందగిరి, పవన్ కుమార్ అంబల్ల, స్వాతి ఖానాపురం తదితరులకు దేవాలయ యాజమాన్యానికి సొసైటీ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ పండుగను యూట్యూబ్లో లైవ్ కవరేజ్ చేసిన సింగపూర్ తెలుగు టీవీ మరియు నిర్వాహకులు రాధాకృష్ణ గణేశ్న గారికి, ఫొటోగ్రఫీ కవరేజ్ చేసిన కృష్ణ నెల్లుట్ల, సౌండ్ సాంకేతికతలో సహకరించిన రజనీకాంత్ మెరుగు,  కార్యక్రమంలో సహకరించిన పూర్వ కమిటీ కార్యవర్గ సభ్యులు లక్ష్మణ్ రాజు కల్వ పండుగ విజయవంతంగా జరగడానికి తోడ్పడిన ప్రతిఒక్కరికి పేరు పేరున కమిటీ వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement