సింగపూర్‌లో ఘనంగా బతుకమ్మ సంబురాలు | Batukamma Celebrations In Singapore By TCSS | Sakshi
Sakshi News home page

సింగపూర్‌లో ఘనంగా బతుకమ్మ సంబురాలు

Oct 24 2020 9:23 PM | Updated on Oct 24 2020 9:28 PM

Batukamma Celebrations In Singapore By TCSS - Sakshi

సింగపూర్‌ : తెలంగాణ సంప్రదాయాన్ని సింగపూర్ లో కొనసాగించడం లో ఎల్లప్పుడు ముందుండే తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ (టీసీఎస్‌ఎస్‌)ఆధ్వర్యంలో  24 అక్టోబర్‌న  సింగపూర్  బతుకమ్మ  జూమ్ ద్వారా కన్నుల పండుగగా నిర్వహించారు. ప్రతీ ఏడూ సుమారు రెండు నుండి మూడు వేల మంది పాల్గొనే ఈ వేడుకలు ఈ సారి కరోనా నిబంధనల కారణంగా ఇంచుమించు 50 చోట్ల ఐదుగురు సమూహంతో ఆన్‌లైన్‌లో నిర్వహించారు.  ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వీడియో సందేశం ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.  

కార్యక్రమాన్ని విజయవంతం చేయడంపై టీసీఎస్‌ఎస్‌ అధ్యక్షుడు నీలం మహేందర్, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి , కోశాధికారి నల్ల భాస్కర్ గుప్త కృతజ్ఞతలు తెలిపారు.ఈ సంబురాలలో గడప స్వాతి రమేశ్, దీప నల్ల, నంగునూరి సౌజన్య, బొడ్ల రోజా రమణి, గోనె రజిత నరేందర్ రెడ్డి, కల్వ రాజు, దుర్గా ప్రసాద్, గర్రేపల్లి కస్తూరి శ్రీనివాస్, నర్రా నిర్మల ఆర్ సీ రెడ్డి,  గార్లపాటి లక్ష్మ రెడ్డి, జూలూరి పద్మజ సంతోష్, బసిక అనిత రెడ్డి, సునీత రెడ్డి మిర్యాల, పెరుకు శివ రామ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement