వర్జీనియా, కాలిఫోర్నియాలో వెటా ఆధర‍్యంలో బతుకమ్మ సంబురం!

Auspicious Bathukamma celebration in Virginia and California by WETA - Sakshi

తెలంగాణలో ఊరూ వాడా పూలజాతర సందడి చేస్తున్నట్టే అమెరికాలో కూడా విమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ (వెటా) సంస్థ బతుకమ్మ వేడుకలను వర్జీనియా రాష్ట్రంలోని FAIRFAX నగరంలో ఘనంగా నిర్వహించింది.  స్థానిక ఎస్‌బీ లోటస్ టెంపుల్ ఆవరణలో పూలతో బతుకమ్మని పేర్చి, పసుపు ముద్దతో గౌరమ్మని అలంకరించుకుని, ఒక్కొక్క పువ్వేసి చందమామా...ఒక్క జాము గడిచె చందమామా, బతుకమ్మ బతుకమ్మ ఊయ్యాలో మాతల్లి బతుకమ్మ ఊయ్యాలో అంటూ అనేక  బతుకమ్మ పాటలతో బతుకమ్మ పండుగను అంగరంగ వైభవంగా జరుపు కున్నారు. సంప్రదాయ వస్త్రాదారణలో తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి, బతుకమ్మ చుట్టూ తిరుగుతూ ఆడిపాడి సందడి చేశారు.

మహిళా శక్తి స్వరూపిణిగా చెప్పే ఈ దసరా నవరాత్రి రోజులలో వచ్చే సంబరాల్లో "బతుకమ్మ పండుగ" తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అన్న విషయం తెలిసిందే.  ‘ఉమెన్ ఎంపవర్ మెంట్ తెలుగు అసోసియేషన్ (వేటా)’  స్థాపించినప్పటినుంచి ప్రతి ఏడాది ఈ బ్రతుకమ్మ పండుగను వైభవంగా నిర్వహిస్తూ వస్తున్నారు.  ఈవేడుకల్లో ప్రముఖ  యాంకర్‌ ఉదయ భాను దాదాపు 800 మంది పెద్దలు , పిల్లలను ఎంటర్‌టైన్‌  చేశారు.

ఈ కార్యక్రమం విజయవంతం చేసిన వారందరికీ  వెటాప్రెసిడెంట్ ఝాన్సీ రెడ్డి హనుమాండ్ల , advisory కౌన్సిల్ కో-చైర్ Dr అభితేజ కొండా , ప్రెసిడెంట్ ఎలెక్ట్ శైలజ కల్లూరి, నేషనల్ మీడియా చైర్ సుగుణ రెడ్డి  కృతఙ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం వర్జీనియా  బోర్డ్ అఫ్ డైరెక్టర్ జయశ్రీ తెలుకుంట్ల,  మేరీల్యాండ్ బోర్డు ఆఫ్ డైరెక్టర్ ప్రీతి రెడ్డి,  రీజినల్ కల్చరల్ చైర్  చైతన్య పోలోజు,రీజినల్ కోర్ కమిటీ స్మృతి రెడ్డి పర్యవేక్షణలో జరిగింది. సతీష్ వడ్డే, సుధ పాలడుగు, సతీష్ వేమన, విశ్వేశ్వర్ కలవాల,కాంగ్రెస్ మహిళజెన్నిఫర్ వెక్స్టన్ హాజరయ్యారు.

 కాలిఫోర్నియాలో బతుకమ్మ సంబరాలు
కాలిఫోర్నియా లోని హ్యాంఫోర్డ్ నగరంలో వెటా ప్రెసిడెంట్ ఝాన్సీ రెడ్డి హనుమాండ్లగారి బంగ్లా ఆవరణలో " బతుకమ్మ పండుగ శోభ సంతరించుకుంది.   ఈ కార్యక్రమానికి ఫుడ్ స్పాన్సర్ చేసిన Dr కాంతం & సుజాత గాదె గారికి ఝాన్సీ గారు కృతజ్ఞతలు తెలియ చేసారు. ఈ కార్యక్రమంలో WETA treasurer  విశ్వ వేమిరెడ్డి, కమ్యూనిటీ చైర్ జ్యోతి, RVP పూజ రెడ్డి, సెక్రటరీ అనురాధ అలిశెట్టి, హైమ అనుమాండ్ల తో పాటు దాదాపు 500 మంది పెద్దలు, పిల్లలు పాల్గొన్నారు.

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top