మూగ బాలుడికి మాటలు | - | Sakshi
Sakshi News home page

మూగ బాలుడికి మాటలు

Nov 28 2026 1:26 AM | Updated on Nov 28 2026 1:26 AM

గాంధీఆస్పత్రి: వినికిడి లోపంతో జన్మించి, మూగగా మారిన బాలుడికి సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రి వైద్యులు కాక్లియర్‌ ఇంఫ్లాంట్‌ సర్జరీ చేసి మాటలు తెప్పించారు. గాంధీ సూపరింటెండెంట్‌ ఉషారాణి, ఈఎన్‌టీ విభాగాధిపతి నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా బాన్సువాడకు చెందిన ఎనిమిదేళ్ల విహాన్‌సాయి పుట్టుకతోనే చెవుడు, మూగ. ప్రైవేటు ఆస్పత్రుల్లో సర్జరీకి రూ.12 లక్షల వరకు ఖర్చవుతాయని చెప్పడంతో గాంధీ ఆస్పత్రిలో చేర్పించారు. ఈఎన్‌టీ హెచ్‌వోడీ నాగరాజు నేతృత్వంలో కాక్లియర్‌ ఇంఫ్లాంట్‌ సర్జరీ చేయడంతో మాటలు వచ్చాయి. డీఎంఈ వాణి చొరవతో సీఎం సహాయనిధి అందింది. ఈఎన్‌టీ, అనస్థీషియా వైద్యులు నాగరాజు, రమేశ్‌, రామ్‌జీ, శ్రీనివాస్‌నాయక్‌, శివను డీఎంఈ వాణి, సూపరింటెండెంట్‌ ఉషారాణి, ప్రిన్సిపాల్‌ ఇందిర, డిప్యూటీ సూపరింటెండెంట్‌ సునీల్‌ కుమార్‌లు అభినందించారు.

● గాంధీలో విజయవంతంగా కాక్లియర్‌ ఇంప్లాంట్‌ సర్జరీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement