ఖలీల్వాడి: జిల్లా కేంద్రంలో ఖలీల్వాడిలో ఉన్న జిల్లా గ్రంథాలయాన్ని డీఈవో సాయాగౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి శు క్రవారం పరిశీలించారు. గ్రంథాలయ శిథిలావస్థకు చేరిందని పాఠకులు, పోటీ పరీక్షలకు వచ్చే అభ్యర్థులకు ఇబ్బందిగా మారుతుందని చైర్మన్ డీఈవో దృష్టికి తీసుకొచ్చారు. గ్రంథాలయంలో ఉన్న గదులను పరిశీలించారు. గ్రంథాలయం పక్కనే ఉన్న పాత డీఈవో ఆఫీస్లో అదనంగా మూడు రూములు పాఠకుల రీడింగ్ రూమ్ కోసం అందించాలని కోరగా ఒక హాల్ తోపాటు మరో మూడు రూములు కూడా పాఠకుల కొరకు ఇస్తామని హామీ ఇచ్చారు. దీంతో పాఠకుల సమస్య కొంత మేరకు తగ్గుతుందని చైర్మన్ రాజిరెడ్డి తెలిపారు.


