స్కేటింగ్‌పై 60 కిలోమీటర్ల యాత్ర | - | Sakshi
Sakshi News home page

స్కేటింగ్‌పై 60 కిలోమీటర్ల యాత్ర

Nov 28 2026 1:26 AM | Updated on Nov 28 2026 1:26 AM

స్కేటింగ్‌పై 60 కిలోమీటర్ల యాత్ర

– నాయగావ్‌ నుంచి బడాపహాడ్‌ దర్గాకు యువకుడి ప్రయాణం

రుద్రూర్‌: మహారాష్ట్రలోని నాయగావ్‌కు చెందిన షేక్‌ షాదుల్‌ తన ఇష్టదైవమైన హజ్రత్‌ సయ్యద్‌ షాదుల్లా హుస్సేనీ దర్గాను దర్శించుకునేందుకు స్కేటింగ్‌పై చేపట్టిన యాత్ర అందరినీ ఆకట్టుకుంటోంది. శుక్రవారం ఉదయం 6 గంటలకు నాయగావ్‌ నుంచి బయలుదేరిన ఆయన స్కేటింగ్‌ చేస్తూ 60 కిలోమీటర్లు ప్రయాణించి మధ్యాహ్నం 12 గంటలకు రుద్రూర్‌ మండలం అక్బర్‌నగర్‌కు చేరుకున్నారు. అక్కడి మసీదులో జుమా నమాజ్‌ ఆచరించి తిరిగి యాత్రను కొనసాగించారు. ఈ సందర్భంగా అక్బర్‌నగర్‌ మసీదు కమిటీ అధ్యక్షుడు షేక్‌ మొహమ్మద్‌తో పాటు గ్రామస్తులు షాదుల్‌ను అభినందించారు. అనంతరం వర్ని మండలంలోని బడాపహాడ్‌ దర్గాకు బయలుదేరారు. మసీదు ఇమామ్‌ అహ్మద్‌ రజా, షేక్‌ ఖదీర్‌, షేక్‌ సజీద్‌, షేక్‌ ఖలీం, షేక్‌ సమీర్‌, షేక్‌ అలీం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement