చేనేత వస్త్రాలను ధరిద్దాం | - | Sakshi
Sakshi News home page

చేనేత వస్త్రాలను ధరిద్దాం

Nov 28 2026 1:26 AM | Updated on Nov 28 2026 1:26 AM

చేనేత వస్త్రాలను ధరిద్దాం

ఆర్మూర్‌టౌన్‌: చేనేత రంగాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలను ధరించాలని ఏఐడబ్ల్యూఎఫ్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి చోళ రాజేశ్వర్‌, జాతీయ అధికార ప్రతినిధి రాపోలు జగన్‌ అన్నారు. ఆర్మూర్‌ పట్టణంలోని సీ కన్వెషన్‌ హాల్‌ లో ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా ఏఐడబ్ల్యూఎఫ్‌ చేనేత కులాల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చేనేత కళాకారులు నిరంతరం నేత వృత్తిలో నిమగ్నమై ఉన్నప్పటికి వారికి ప్రభుత్వం వెంటనే పెన్షన్లు అందించాలన్నారు. ప్రజలు విక్రయ కేంద్రంలో నాణ్యమైన చేనేత వస్త్రాలు ఉంటాయని వాటిని కొనుగోలు చేయాలని కోరారు. కార్యక్రమంలో పట్టు చేనేత సహకార సంఘం చైర్మన్‌ గంగా మోహన్‌ చక్రు, ఈఆర్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌ రాజశేఖర్‌, ఆర్మూర్‌ చేనేత సహకార సంఘం చైర్మన్‌ చెన్నరవి, జిల్లా పద్మశాలి పట్టణ అధ్యక్షుడు పెంట దత్తాత్రి, ఆర్మూర్‌ చేనేత సహకార సంఘం ఉపాధ్యక్షుడు డేరా గంగామోహన్‌, డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement