ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తిని కాపాడిన పోలీసులు | - | Sakshi
Sakshi News home page

ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తిని కాపాడిన పోలీసులు

Nov 28 2026 1:26 AM | Updated on Nov 28 2026 1:26 AM

ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తిని కాపాడిన పోలీసులు

వేల్పూర్‌(మెండోరా): ఎస్సారెస్పీలో దూకి ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించిన ఆదిలాబాద్‌ జిల్లా నేరెడిగొండ మండలం వాంకిడి గ్రామానికి చెందిన అనురూప్‌ అనే వ్యక్తిని మెండోరా పోలీసులు శుక్రవారం రక్షించారు. మెండోరా ఎస్సై సుహాసిని తెలిపిన వివరాల ప్రకారం.. అనురూప్‌ ప్రైవేటు జాబ్‌ చేసుకుంటూ జీవిస్తుండగా, కుటుంబంలో ఏర్పడిన గొడవల కారణంగా ఆత్మహత్య చేసుకోవాలని ఎస్సారెస్పీకి రాగా, సమాచారం అందుకున్న పోలీసులు అతనిని ప్రాజెక్టుపై గుర్తించారు. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి వారికి అప్పగించారు. అనురూప్‌ను కాపాడటంలో సహకరించిన జెన్‌కో సిబ్బంది హెచ్‌జీ షూకూర్‌, హెచ్‌జీ నాగమణి, అక్బర్‌, పిబ్రి, దశరథ్‌, నిర్మల, పోలీసు సిబ్బందిని ఎస్సై అభినందించారు.

కుక్కల దాడిలో 32 గొర్రెపిల్లలు మృతి

భిక్కనూరు: మండల కేంద్రం సమీపంలో ఉన్న మేకల కొట్టాలపై కుక్కలు శుక్రవారం వేకువజామున దాడిచేశాయి. దాడిలో సుమారు 32 గొర్రె పిల్లలు మృతి చెందాయి. భిక్కనూరు మండల కేంద్రానికి చెందిన ఓన్నాసుల సిద్ధ రాములుకు చెందిన 25 గొర్రె పిల్లలు, కోకట్ల రాములుకు చెందిన ఏడు గొర్రె పిల్లలు మృతి చెందాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement