బోధన్‌టౌన్(బోధన్): ఏడు నెలల గర్భిణి బోధన్‌లో ని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స కోసం వచ్చి మృతి చెందిన ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి. కోటగిరి మండల కేంద్రానికి చెందిన గౌసియా బేగం(25) అనే గర్భిణి 20 రోజుల క్రితం మండల కేంద్రంలోనే ఉంటుంన్న తల్లిగారింటికి వచ్చింది.గురువారం ఉదయం అస్వ స్థతకు గురికావడంతో కుటుంబసభ్యులు బోధన్‌లోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొని వచ్చారు. పరీక్షించిన వైద్యులు ప్రథమ చికిత్స అందించి మెరుగైన చికిత్స కోసం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పతికి అంబులెన్స్‌లో తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి అప్పటికే గౌసియా బేగం మరణించినట్లు తెలిపారు. దీంతో కన్నీరు మున్నీరైన కుటుంబసభ్యులు బోధన్ ఆస్పత్రిలోని వైద్యుల నిర్లక్ష్యంతోనే గర్భిణి మృతి చెందినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై జిల్లా మాతాశిశు సంక్షణ అధికారి శిఖర శుక్రవారం విచారణ చేపట్టారు. గర్భిణి ఆస్పత్రికి వచ్చిన సమయం, అందించిన వై ద్యం, రిఫర్ చేయడానికి కారణాలపై గైనకాలజిస్టులను ప్రశ్నించారు. అనంతరం రికార్డులను పరిశీలించి సమగ్ర విచారణ చేపట్టారు. గర్భిణి అస్వస్థతకు గురై గురువారం ఉదయం వచ్చిందని, ప్రథమ చికిత్స అందించి, బీపీ ఎక్కువ కావడంతో మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్ ఆస్పత్రికి తరలించినట్లు వైద్యులు తెలిపారు.ఇలాంటి ఘటన లు పునరావృతం కాకుండా సేవలు అందించాలని, నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. మాతాశిశు మరణాలు తగ్గించేలా వైద్య సేవలు అందించాలని సూచించారు. జిల్లా అధికారి వెంట ఉపవైద్యాధికారి విద్య, ఆస్పత్రి సూపరింటెండెంట్ రాహుల్, గైనకాలజిస్టులు రోజా, వర్ష ఉన్నారు.


