● మోకు దెబ్బ జాతీయ అధ్యక్షుడు
అమరవేణి నర్సాగౌడ్
ఆర్మూర్: వీడీసీల రద్దుకు మోకు దెబ్బ ఆధ్వర్యంలో ఐక్య ఉద్యమాలు చేపడతామని తెలంగాణ గౌడ సంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మన్, గౌడ జనహక్కుల పోరాట సమితి మోకు దెబ్బ జాతీయ అధ్యక్షుడు అమరవేణి నర్సాగౌడ్ పేర్కొన్నారు. ఆర్మూర్ మండలం పల్లెలోని రామాలయ ఫంక్షన్ హాల్‌లో గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ జిల్లా రెండో మహాసభలను శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్మూర్ సబ్ డివిజన్‌లో దేశంలో ఎక్కడాలేని విధంగా వీడీసీలు గ్రామాభివృద్ధి పేరి ట గీత కార్మికులపై, దళితులపై, బడుగు బలహీన వర్గాల ప్రజలపై దాడులు చేస్తూ సాంఘిక బహిష్కరణలు చేస్తున్నాయని ఆరోపించారు. వీడీసీల అక్రమాలను నియంత్రిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు కోటగిరి అరుణ్‌కుమార్ గౌడ్, మోకు దెబ్బ జాతీయ సెక్రెటరీ జనరల్ రాగుల సిద్ధిరాములు గౌడ్, ప్రధాన కార్యదర్శి కొండాపురం బాలరాజ్ గౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీపతి లింగాగౌడ్, ఆర్మూర్ ఏఎంసీ మాజీ చైర్మన్ అలల్ సాయిబాబాగౌడ్, రాష్ట్ర నాయకులు కిషన్ గౌడ్, పడాల రాజేందర్ గౌడ్, వేంపల్లి సరోజగౌడ్, కొండగొని రవీందర్ గౌడ్, పోగుల నగేశ్ గౌడ్, జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.


