ఏపీపీగా కళ్యాణి | - | Sakshi
Sakshi News home page

ఏపీపీగా కళ్యాణి

Oct 24 2026 10:02 AM | Updated on Oct 24 2026 10:02 AM

ఏపీపీగా కళ్యాణి నాణ్యమైన విద్యుత్‌కు ఆధునిక టెక్నాలజీ వినియోగం పట్టపగలే తాళం వేసిన ఇంట్లో చోరీ లైంగిక వేధింపుల కేసులో ఒకరికి ఏడేళ్ల జైలు

నిజామాబాద్‌ లీగల్‌ : తెలంగాణ పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఇటీవల ప్రకటించిన అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ఫలి తాల్లో నిజామాబాద్‌ బార్‌ అసోసియేషన్‌ న్యాయవాది కళ్యాణి ఎంపికయ్యారు. 2019లో కరీంనగర్‌ జస్టిస్‌ కొమరయ్య న్యాయ కళాశాల నుంచి ఎల్‌ఎల్‌బీ పట్టాను పొందిన కళ్యాణి, నిజామాబాద్‌ బార్‌ అసోసియేషన్‌లో న్యాయవాదిగా ఎన్‌రోల్‌ అయ్యి, సీనియర్‌ న్యాయవాది తులసీదాస్‌ వద్ద ప్రాక్టీస్‌ చేసింది. 2020 నుంచి న్యాయవాదిగా పనిచేస్తూ సివిల్‌, క్రిమినల్‌ కేసులను వాదిస్తున్నారు.కళ్యాణి మామ బోధన్‌ సీనియర్‌ సివిల్‌ జడ్జీగా పనిచేసి పదవీవిరమణ పొందా రు. ఆమె భర్త నిజామాబాద్‌లో డాక్టర్‌గా పనిచేస్తున్నారు. కళ్యాణి ఏపీపీగా నియామకం అవ్వడంపై న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు.

● ఎన్‌పీడీసీఎల్‌ ఎస్‌ఈ పీవీ

రాజేశ్వర్‌రావు

సుభాష్‌నగర్‌: వినియోగదారులకు మరింత మెరుగైన, నాణ్యమైన విద్యుత్‌ సరఫరా అందించేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ పలు కీలక చర్యలు చేపడుతున్నట్లు ఎన్‌పీడీసీఎల్‌ నిజామాబాద్‌ సర్కిల్‌ సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌ పీవీ రాజేశ్వర్‌రావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 33 కేవీ ఇంటర్‌లింక్‌ లైన్ల ఏర్పా టు, 33 కేవీ, 11 కేవీ విద్యుత్‌ లైన్లలో ఫాల్ట్‌ ప్యాసేజ్‌ ఇండికేటర్ల వినియోగం, ప్రతి సబ్‌స్టేషనన్‌లో రెండు పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్లు ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. విద్యుత్‌ పంపిణీ వ్యవస్థను మరింత పటిష్టం చేయడంతోపాటు విద్యుత్‌ అంతరాయాల సమయాన్ని తగ్గించి వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌ సరఫరా అందించేందుకు సంస్థ కృషి చేస్తోందని ఆయన పేర్కొన్నారు.

నిజామాబాద్‌ రూరల్‌: గుర్తు తెలియని వ్యక్తులు పట్టపగలే తాళం వేసిన ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. నిజామాబాద్‌ రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని మాధవనగర్‌లో శుక్రవారం మధ్యాహ్నం ఘటన చోటు చేసుకుంది. ఎస్‌హెచ్‌వో శ్రీధర్‌ రెడ్డి తెలిపిన వివ రాల ప్రకారం.. మాధవనగర్‌కు చెందిన మ మ్మదేవి నిర్మల ఇంటికి తాళం వేసి కూతురితో కలిసి స్థానికంగా ఉన్న బంధువుల ఫంక్షన్‌కు మధ్యాహ్నం 12 గంటలకు వెళ్లింది. ఫంక్షన్‌ ముగించుకొని తిరిగి 2.30 గంటలకు ఇంటికి రాగా తాళం పగులగొట్టి ఉంది. బెడ్‌రూమ్‌ లోని నగదు, బంగారం, వస్తువులు అపహరణకు గురైనట్లు గ్రహించి రూరల్‌ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

నిజామాబాద్‌ లీగల్‌: బాలికపై లైంగిక వేధింపుల కేసులో నిందితుడికి ఏడేళ్ల జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ నిజామాబాద్‌ పోక్సో కోర్టు ఇన్‌చార్జి జడ్జి డి. దుర్గాప్రసాద్‌ తీర్పు వెలువరించారు. వివరాలు ఇలా ఉన్నాయి. 2021 సెప్టెంబర్‌లో నగరంలోని కోటగల్లి ప్రాంతానికి చెందిన మాచా రవీంద్రనాథ్‌ ఐదేళ్ల బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించి, లైంగిక వేధింపులకు పాల్పడినట్లు వచ్చిన ఫిర్యాదు మేరకు, నాల్గో టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారించిన పోలీసులు నిందితునిపై ఆరోపణలు నిజమని తేలడంతో కేసు నమోదు చేసి కోర్టుకు తరలించారు. కేసును విచారించిన పోక్సో కోర్టు జడ్జి దుర్గాప్రసాద్‌ సాక్ష్యాధారాలను పరిశీలించి నిందితుడికి ఐపీసీ సెక్షన్‌ 354 డీ ప్రకారం 5 సంవత్సరాల జైలు శిక్షతోపాటు రూ.10 వేల జరిమానా విధించారు. పోక్సో చట్టంలోని సెక్షన్‌ 9 కింద ఏడు సంవత్సరాల కఠిన కారాగార శిక్షతోపాటు రూ.10 వేల జరిమానా విధించారు. రెండు శిక్షలను ఏకకాలంలో అనుభవించాలని తీర్పులో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement