తనిఖీలు చేస్తాం
బాన్సువాడ : పట్టణ, మండల శివారుల్లో వెలుస్తున్న టీ స్టాల్స్ గంజాయి విక్రయాలకు అడ్డాగా మారుతున్నాయి. చాయ్ పేరిట హోటళ్లు ఏర్పాటు చేస్తూ కొందరు అక్రమార్కులు గంజాయి అమ్మకాలు సాగిస్తున్నట్లు తెలిసింది. రెండు రాష్ట్రాల సరిహద్దుగా ఉన్న బాన్సువాడలో గుట్టు చప్పుడుకాకుండా గంజాయిని తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. బాన్సువాడ, బీర్కూర్, నస్రుల్లాబాద్ ప్రాంతాల్లో విచ్చలవిడిగా గంజాయి విక్రయాలు జరుగుతున్నా సంబంధిత శాఖ అధికారులు దృష్టి సారించకపోవడం గమనార్హం.
మహారాష్ట్ర నుంచి బాన్సువాడకు..
మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లో గంజాయి కొనుగోలు చేసి బాన్సువాడలో విక్రయిస్తున్నట్లు తెలిసింది. ప్రధానంగా యువత, కూలీలను లక్ష్యంగా చేసుకొని గంజాయి దందా సాగిస్తున్నారు. రెండు నెలల క్రితం బీర్కూర్‌లో నలుగురు యువకులను పోలీసు లు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. బీర్కూర్ మండల కేంద్రంలోని మంజీర నదిపై వారధి నిర్మించడంతో మహారాష్ట్ర నుంచి రాకపోకలకు మార్గం సుగమం అయ్యింది. దీంతో అక్రమార్కులు ఈ వారధి నుంచే గంజాయి సరఫరా చేస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పరదా వెనక మత్తు
బాన్సువాడ శివారు ప్రాంతాల్లో ఇటీవల కాలంలో పదుల సంఖ్యలో టీ స్టాల్స్ వెలిశాయి. ఉదయం నుంచి రాత్రి వరకు చాయ్ హోటళ్లన్నీ కిటకిటలాడుతున్నాయి.
నిత్యం వచ్చే యువకులు, కూలీలు టీ స్టాల్స్‌కు వెనకాల ఉండే పరదా వెనక్కి వెళ్లి సిగరెట్లు తాగుతూ కనిపిస్తారు. మరికొందరు యువకులు సిగరెట్లలో గంజాయిని కలుపుకొని సేవిస్తున్నట్లు సమాచారం. పట్టణంలోని బోధన్ రోడ్డు, సంగమేశ్వర కాలనీ, తాడ్కోల్ డబుల్ బెడ్ కాలనీ, గౌలీగూడ, పాత అంగడి బజారు తదితర ప్రాంతాల్లోని హోటళ్లలో గంజాయి విక్రయాలు సాగుతున్నట్లు తెలిసింది.
ఇప్పటి వరకు హోటళ్లలో గంజాయి విక్రయిస్తున్న ట్లు మా దృష్టికి రాలేదు. దసరా పండుగ ఉందని త నిఖీలు చేయలేదు. హోటళ్లలో తనిఖీలు చేసి యువకులకు అవగాహన కల్పిస్తాం. గంజాయి సేవించినా, విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటాం.
– లావణ్య, ఎకై ్సజ్ సీఐ
హోటళ్లలో జోరుగా విక్రయాలు
శివారు ప్రాంతాల్లో పుట్టగొడుగుల్లా
వెలుస్తున్న టీ స్టాల్స్
మత్తు బారినపడుతున్న యువత
పట్టించుకోని యంత్రాంగం


