సమ్మె బాట.. ఆగిన టీకా | - | Sakshi
Sakshi News home page

సమ్మె బాట.. ఆగిన టీకా

Oct 17 2026 12:46 AM | Updated on Oct 17 2026 12:46 AM

జగన్మాతకు నీరాజనం

● విధులు బహిష్కరించిన ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు

● సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌

● ఆరోగ్య సేవల్లో అంతరాయం

శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. మండపాల్లో అమ్మవారు వివిధ రూపాల్లో దర్శనమిస్తున్నారు. శుక్రవారం శ్రీ సరస్వతి దేవి, కాత్యాయని అలంకారంలో భక్తుల పూజలందుకున్నారు. మండపాల నిర్వాహకులు హోమం, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. నగరంలోని ఆర్యనగర్‌ అభయ వీర హనుమాన్‌ కమిటీ హాల్‌లో అమ్మవారి తొమ్మిది అవతారాల వేషధారణలో చిన్నారులు అలరించారు. – నిజామాబాద్‌ రూరల్‌/ మోపాల్‌

నిజామాబాద్‌అర్బన్‌: జిల్లా వైద్య ఆరోగ్య శాఖలోని నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం) ఉద్యోగులు సమ్మెబాట పట్టారు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ నాలుగు రోజులుగా విధులు బహిష్కరించి నిరసనలు చేస్తున్నారు. దీంతో క్షేత్రస్థాయిలో వైద్య సేవలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది.

630 మంది ఉద్యోగులు

జిల్లాలో 27 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 225 ఆ రోగ్య ఉప కేంద్రాలు ఉన్నాయి. వీటి పరిధిలో 630 మంది నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ ఉద్యోగులు 78 క్యాడర్లలో కాంట్రాక్ట్‌ పద్ధతిలో పనిచేస్తున్నారు. తమను రెగ్యులర్‌ చేయాలని, సమాన పనికి సమాన వేత నం ఇవ్వాలనే డిమాండ్‌తో ఈ నెల 13 నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్లారు. జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్‌లో ప్రతిరోజు నిరసనలు చేస్తున్నారు. వీరికి బీఆర్‌ఎస్‌, బీజేపీ నేతలు మద్దతు ప్రకటించారు.

నిలిచిన సేవలు..

ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు సమ్మె.. వైద్య సేవలపై తీవ్ర ప్రభావం పడుతోంది. జిల్లాలో ప్రతి బుధవారం, శనివారం 2,075 మంది చిన్నారులకు టీకా లు అందిస్తారు. వ్యాక్సినేషన్‌లో రెగ్యులర్‌ ఏఎన్‌ఎంలతోపాటు సెకండ్‌ ఏఎన్‌ఎం(కాంట్రాక్ట్‌)లు సేవ లందిస్తారు. సమ్మె నేపథ్యంలో టీకాల కార్యక్రమం నిలిచిపోయింది. గర్భిణుల చెకప్‌, సీజనల్‌ వ్యా ధుల నిర్మూలన, ఫ్రైడే డ్రైడే, యు విన్‌ పోర్టల్‌లో నమోదు ప్రక్రియ నిలిచిపోవడంతోపాటు ప్రతి వారం బీపీ, షుగర్‌ వ్యాధిగ్రస్తులకు మందుల పంపిణీలో కూడా సమస్యలు ఎదురవుతున్నాయి.

గోవూర్‌లో కుట్టు శిక్షణ కేంద్రాన్ని ప్రారంభిస్తున్న రాష్ట్ర వయోజన కేంద్రాల సంచాలకులు శ్రీనివాస్‌

ఉద్యోగుల డిమాండ్లు ఇవే..

సమాన పనికి సమాన వేతనం, వంద శాతం గ్రాస్‌ సాలరీ చెల్లించాలి.

అవుట్‌ సోర్సింగ్‌ ఏజెన్సీలను రద్దు చేసి, నేరుగా స్టేట్‌ హెల్త్‌ సొసైటీ పరిధిలోకి తెచ్చి ‘స్పర్శ్‌’ ద్వారా వేతనాలు ఇవ్వాలి.

ఈహెచ్‌ఎస్‌ లేదా ఈఎస్‌ఐ వర్తింపజేయాలి. 2002 నుంచి పనిచేస్తున్న వారికి 5 శాతం ఇంక్రిమెంట్‌, 8 శాతం లాయల్టీ బోనస్‌ ఇవ్వాలి.

వేతనంతో కూడిన 180 రోజుల ప్రసూతి సెలవులు మంజూరు చేయాలి.

విధి నిర్వహణలో మరణిస్తే రూ.20 లక్షల బీమా, ఎక్స్‌గ్రేషియాతోపాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలి.

పెండింగ్‌లో ఉన్న తొమ్మిది నెలల పీఆర్‌సీతోపాటు ఏరియర్స్‌ను విడుదల చేయాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement