● అదనపు డీసీపీ శుభం ప్రకాశ్
నిజామాబాద్అర్బన్: మహిళల రక్షణ, భద్రతకు అధిక ప్రాధాన్యతనివ్వాలని అదనపు డీసీపీ శుభం ప్రకాశ్ పేర్కొన్నారు. పోలీస్ కమిషనర్ కార్యాల యంలో మహిళలు, బాలికల భద్రతపై శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల, బాలికలు ఎదు ర్కొంటున్న సమస్యలపై అధికారులు సత్వరమే స్పందించాలన్నారు. బాధితులకు భరోసా కల్పిస్తూ వారికి న్యాయం జరిగేలా సమన్వయంతో పనిచేయాలన్నారు. మహిళలపై వేధింపులు, గృహహింస, మానవ అక్రమ రవాణా వాటి నేరాల నివారణ కు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. బాధితుల ఫిర్యాదులను సున్నితంగా స్వీకరించి చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. షీ టీమ్స్ ద్వారా మహిళలు బాలికలకు భద్రతపై అవగాహన కల్పించారు. వేధింపులకు పాల్పడే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. భరోసా సెంటర్ ద్వారా మహిళలకు అవసరమైన సహాయం అందించాలన్నారు. సమావేశంలో సీసీఆర్బీ ఏసీపీ గురునాయుడు, మహిళా పోలీస్ స్టేషన్ సీఐ ప్రసాద్, సీసీఎస్ సీఐ సురేశ్, షీ టీం మహిళా ఎస్సై స్రవంతి తదితరులు పాల్గొన్నారు.


