ప్రత్యామ్నాయ పంటలు వేయాలి | - | Sakshi
Sakshi News home page

ప్రత్యామ్నాయ పంటలు వేయాలి

Oct 17 2026 12:46 AM | Updated on Oct 17 2026 12:46 AM

నేడు ‘సాగర్‌’ నీటి విడుదల

● అదనపు కలెక్టర్‌ భుజంగరావు

వర్ని: యాసంగి సీజన్‌లో రైతులు ప్రత్యా మ్నాయ ఆరుతడి పంటలను సాగు చేయాల ని అదనపు కలెక్టర్‌ భుజంగరావు సూచించారు. వర్ని సహకార సంఘంలో ఆయన శుక్రవారం రైతులతో మాట్లాడారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు కురియకపోవడంతో విద్యుత్‌ సరఫరాలో అంతరాయం, భూగర్భ జలాలు తగ్గే అవకాశం, నిజాంసాగర్‌ నీటిని సాగు కోసం వదలకపోవడంతో కష్టాలు ఎదురవుతాయని పేర్కొన్నారు. రైతులు వరికి బదులు కుసుమ, పొద్దుతిరుగుడు, శనగ, పెసర, జొన్న వంటి ఆరుతడి పంటలను సాగు చేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు వ్యవసాయ సంచాలకులు కృష్ణ, మండల వ్యవసాయ అధికారి రాజశేఖర్‌, ఏఎంసీ చైర్మన్‌ సురేశ్‌బాబా పాల్గొన్నారు.

కేంద్రమంత్రిని కలిసిన పసుపు బోర్డు చైర్మన్‌

సుభాష్‌నగర్‌: కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ను న్యూఢిల్లీలోని కార్యాలయంలో జాతీయ పసుపు బోర్డు చైర్మన్‌ పల్లె గంగారెడ్డి శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జాతీయ పసుపు బోర్డు కార్యకలాపాలు, పసుపు రైతుల సమస్యలు, పసుపు ఎగుమతుల పెంపు, విలువ ఆధారిత ఉత్పత్తుల అభివృద్ధి, ఔషధ రంగంలో పసుపు వినియోగం వంటి పలు కీలక అంశాలపై సమగ్ర సమాచారంతో కూడిన నివేదికను కేంద్రమంత్రికి అందజేశారు. పలు విషయాలపై సుదీర్ఘంగా చర్చించారు. కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ సానుకూలంగా స్పందించి, హర్షం వ్యక్తంచేశారు.

దరఖాస్తుల ఆహ్వానం

నిజామాబాద్‌అర్బన్‌: అలైడ్‌ హెల్త్‌ కేర్‌ పారామెడికల్‌ డిప్లొమా కోర్సులలో 2026–27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం నోటిఫికేషన్‌ జారీ చేసినట్లు ప్రభుత్వ మెడికల్‌ కళాశాల ప్రిన్సిపల్‌ కృష్ణమోహన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. డిప్లొమా ఇన్‌ మెడికల్‌ ల్యాబ్‌ టెక్నీషియన్‌ 30 సీట్లు, డిప్లొమా ఇన్‌ డయాలసిస్‌ 10 సీట్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ఇంటర్‌లో బైపీసీ, ఎంపీసీ చదివిన విద్యార్థులు దరఖాస్తు చేసుకొని సంబంధిత కాపీని మెడికల్‌ కళాశాలలో అందజేయాలని సూచించారు. ఈ నెల 24వ తేదీలోపు దరఖాస్తులను అందించాలని పేర్కొన్నారు.

నిజాంసాగర్‌(జుక్కల్‌): వానాకాలం పంటల అవసరాల నిమిత్తం శనివారం నిజాంసాగర్‌ ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువకు మూడవ విడత నీటిని విడుదల చేయనున్నట్లు నీటిపారుదల శాఖ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువకు 1,000 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తామన్నారు. ప్రధాన కాలువ వైపు రైతులు, పశువుల కాపర్లు వెళ్లవద్దని వారు హెచ్చరించారు.

ప్రతి ఒక్కరికీ పని

కల్పించాలి

● రాష్ట్ర ప్రోగ్రాం మానిటరింగ్‌ అధికారి సుబ్రహ్మణ్యం

జక్రాన్‌పల్లి: వీబీజీ రామ్‌ జీ పథకంలో భాగంగా ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించాలని రాష్ట్ర ప్రోగ్రాం మానిటరింగ్‌ అధికారి సు బ్రహ్మణ్యం సూచించారు. జక్రాన్‌పల్లి మండలం సికింద్రాపూర్‌ గ్రామంలో వీబీజీ రామ్‌ జీ పథకంలో పనిచేస్తున్న ఉపాధి కూలీలను శుక్రవారం ఆయన కలిసి మాట్లాడారు. ఎల్‌నినో ప్రభావంతో కలిగే పరిస్థితులను, తట్టుకోవడానికి సంసిద్ధత పనులను వివరించారు. ఆయన వెంట సర్పంచ్‌ అప్పల అరుణ్‌ కుమార్‌, ఎంపీడీవో సతీశ్‌ కుమార్‌, టీఏ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement