ఖలీల్వాడి: ఉద్యోగుల సర్వీస్ బుక్ మాయంపై జిల్లా కేంద్రంలోని నేషనల్ టెక్ట్స్ బుక్ మేనేజర్ శ్రీనివాస్కు ఇంక్రిమెంట్ కట్ చేస్తూ ఆర్జేడీ మదన్మోహన్ ఈ నెల 12న ఉత్తర్వులు జారీచేశారు. ఇందులో పనిచేసే సీనియర్ అసిస్టెంట్ రాము, వేర్ హౌస్మన్ రమేశ్కు చెందిన సర్వీస్ బుక్స్ మాయంపై జూన్ 16న ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి స్పందించిన అప్పటి డీఈవో అశోక్ విచారణ చేపట్టి నివేదికను ఆర్జేడీకి పంపారు. దీంతో మేనేజర్ శ్రీనివాస్ ఇంక్రిమెంట్ కట్ చేయాలని, సర్వీస్ బుక్స్ పోయిన ఇద్దరికీ డూప్లికేట్ బుక్స్ తీసుకునే వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.


