భూసేకరణ వేగవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

భూసేకరణ వేగవంతం చేయాలి

Oct 17 2026 12:46 AM | Updated on Oct 17 2026 12:46 AM

● కలెక్టర్‌ ఇలా త్రిపాఠి

నిజామాబాద్‌అర్బన్‌: జాతీయ రహదారుల ని ర్మాణం, విస్తరణ పనుల కోసం అవసరమైన భూసేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తిచేయా లని కలెక్టర్‌ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. శుక్ర వారం తన చాంబర్‌లో జాతీయ రహదారి పనులకు అవసరమైన భూసేకరణకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న అంశాలపై చర్చించారు. భూ ములు కోల్పోయిన వారికి అందించాల్సిన పరిహారం, ఇప్పటికే పూర్తయిన చెల్లింపులు, మార్కెట్‌ రేటు, భూమి అప్పగించడంలో జాప్యానికి కారణాలు తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. జాతీయ రహదారుల నిర్మాణాలు, విస్తరణ పనుల భూసేకరణపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని హితవుపలికారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ రాజాగౌడ్‌, ఆర్మూర్‌ సబ్‌ కలెక్టర్‌ అభిగ్యాన్‌ మాల్వియా, ట్రెయినీ కలెక్టర్‌ సురేశ్‌, నిజామాబాద్‌, బోధన్‌ ఆర్డీవోలు రాజేంద్రకుమార్‌, విజయకుమారి, జాతీయ రహదారుల సంస్థ అధికారులు, ఇంజినీరింగ్‌ విభాగాల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement