సుభాష్నగర్: వ్యవసాయానికి 16 గంటల నాణ్య మైన విద్యుత్ సరఫరా చేయాలని బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు పాట్కూరి తిరుపతి రెడ్డి డిమాండ్ చేశారు. నగరంలోని విద్యుత్ భవన్ ఎదుట శుక్రవారం కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. అనంతరం ఎస్ఈ రాజేశ్వర్ రావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా తిరు పతి రెడ్డి మాట్లాడుతా విద్యుత్ సరఫరాలో అంతరాయం కారణంగా పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయానికి కేవలం ఆరు గంటలు కూడా విద్యుత్ సరఫరా చేయడం లే దన్నారు. జిల్లా వ్యాప్తంగా అదే పరిస్థితి నెలకొందన్నారు. ఇప్పటికై నా వ్యవసాయానికి 16 గంటలపా టు నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని, లేకుంటే రైతులతో కలిసి ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ముస్కు నర్సయ్య, ఉపాధ్యక్షుడు వెల్మ గంగారెడ్డి, నాయకులు హరీశ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


