● కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కాటిపల్లి నగేశ్‌రెడ్డి
నిజామాబాద్ రూరల్: మహాత్మా గాంధీ సేవలు చిరస్మరణీయమని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాటిపల్లి నగేశ్‌రెడ్డి, నగర అధ్యక్షుడు రామకృష్ణఅన్నారు. నగరంలోని కాంగ్రెస్ భవన్‌లో మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రీ జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారి చిత్రపటాలకు నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అలాగే తిలక్‌గార్డెన్‌లో ఉన్న లాల్ బహుదూర్ శాస్త్రి విగ్రహానికి, గాంధీ చౌక్‌లో ఉన్న గాంధీ విగ్రహానికి నాయకులు పూలమాలలు ఘన నివాళులు అర్పించారు. నగేశ్‌రెడ్డి మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్య్రం రావడంలో గాంధీజీ పాత్ర ఎంతో కీలకమైందని అన్నారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశాన్ని అభివృద్ధి చేయాలని మొదటి ప్రధానిగా నెహ్రూ ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రాష్ట్ర కల్లుగీత కార్మిక చైర్మన్ శేఖర్ గౌడ్, నగర మేయర్ ఉమారాణి, పీసీసీ జెనరల్ సెక్రెటరీ రామ్ భూపాల్, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, నూడా చైర్మన్ కేశ వేణు, ఏఐసీసీ పరిశీలకులు కాపుకర్‌గన్ రాజ్, డీసీసీ కోశాధికారి భక్తవస్తలం, ఉపాధ్యక్షుడు కౌడపు శరత్ కుమార్, గాదరి గోపి, జిల్లా ఓబీసీ అధ్యక్షుడు నరేందర్ గౌడ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కోనేరు సాయికుమార్, ఆదె ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
బెటాలియన్‌లో..
డిచ్‌పల్లి: మండల కేంద్రంలోని తెలంగాణ ప్రత్యేక పోలీస్ ఏడో బెటాలియన్ కమాండెంట్ సీతారాం ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం బెటాలియన్ సిబ్బందితో కలిసి పరిసరాల పరిశుభ్రత కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో బెటాలియన్ కమాండెంట్ బీ సీతారాం, అసిస్టెంట్ కమాండెంట్లు నరసింహస్వామి, విజయ్, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


