బోధన్: ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం, ఉద్యోగుల బకాయిలు, భద్రత సాఽధించే దిశలో పోరాడుతామ ని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, టీజీ ఆర్టీసీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ ఈదురు వెంకన్న అన్నారు. ఉద్యోగుల హక్కుల రక్షణే తమ ప్రధాన అజెండా అని పేర్కొన్నారు. ఆర్టీసీ యూనియన్ గుర్తింపు ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని శుక్రవారం పట్టణ కేంద్రంలోని ఆర్టీసీ డిపోలో ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈదురు వెంకన్న, తెలంగాణ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఏఆర్ రెడ్డి హాజరై మాట్లాడారు. ప్రభుత్వానికి మద్దతు ఉన్న యూనియన్‌ను గెలిపిస్తే ఉద్యోగుల సమస్యలు, సంక్షేమంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించలేరన్నారు. ఎన్నికల్లో ఈయూ, టీఎంయూ, ఎన్‌ఎంయూ ఈ మూడు సంఘాలు కూటమిగా ఏర్పడి పోటీలో నిలిచామని తెలిపారు. కొందరు స్వార్థ నాయకులు ప్రభుత్వం అండతో కార్మికులను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వాన్ని కార్మికుల హక్కుల కోసం ప్రశ్నించే యూనియన్‌ను ఎన్నికల్లో గెలుపించుకోవాలని కోరారు. నాయకులు అహ్మద్ అలీ, సంజీవ్, వెంకట్‌గౌడ్, వందేమాతరం శ్రీనివాస్, హనీఫ్, జీఎన్‌గౌడ్, యాదగిరి, సంజీవ్‌రెడ్డి, కార్మికులు పాల్గొన్నారు.


