రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లా బాల, బాలికల జట్లు | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లా బాల, బాలికల జట్లు

Oct 3 2026 1:20 AM | Updated on Oct 3 2026 1:20 AM

వేల్పూర్‌(ముప్కాల్‌):వేములవాడలో నిర్వహించే రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు జిల్లా బాల, బాలికల జట్లు శుక్రవారం బయలుదేరి వెళ్లినట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు ఆంద్యాల లింగయ్య, గంగాధర్‌రెడ్డి తెలిపారు. ఈనెల 5 వరకు వేములవాడలో నిర్వహించే 52వ జూనియర్‌ అండర్‌ 20 బాలుర అంతర్‌ జిల్లాల కబడ్డీ, 36వ సబ్‌ జూనియర్‌ అండర్‌ 16 బాలికల కబడ్డీ పోటీల్లో జి ల్లా జట్లు పాల్గొంటా యని వెల్లడించారు. ముప్కాల్‌ మండల కేంద్రంలోని భూదేవి ఇండోర్‌ స్టేడియంలో సుమారు 20 రోజులకు పైగా శిక్షణ నిర్వహించి, జిల్లా జట్లు ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. జిల్లా జట్లు రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరచాలని కోరారు. కోచ్‌లుగా అన్వేష్‌, అనిల్‌, మేనేజర్‌లుగా కవిత, తేజ వ్యవహరించనున్నారు. కార్యక్రమంలో ఎస్సారెస్పీడీఈ గణేశ్‌, కే గంగాధర్‌, విజయ్‌, బాలరాజు,మునిరొద్దీన్‌,సాయన్న,గంగారాం,శ్రీకాంత్‌ యా దవ్‌, సంజీవ్‌, దయానంద్‌, శంకర్‌, చోటుబాయ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement