నల్లవెల్లిలో మర్నాగి ప్రత్యక్షం | - | Sakshi
Sakshi News home page

నల్లవెల్లిలో మర్నాగి ప్రత్యక్షం

Oct 3 2026 1:20 AM | Updated on Oct 3 2026 1:20 AM

ఇందల్వాయి: మండలంలోని నల్లవెల్లి గ్రామంలో మర్నాగి ప్రత్యక్షమైంది. బీట్‌ ఆఫీసర్‌ సందీప్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మర్నాగి సమీప అటవీ ప్రాంతం నుంచి గురువారం రాత్రి దారి తప్పి నల్లవెల్లి గ్రామంలోకి వచ్చింది. కుక్కల భయంతో విద్యుత్‌ స్తంభం ఎక్కి అక్కడే ఉండి పోయింది. శుక్రవారం ఉదయం గ్రామస్తులు సమాచారం ఇవ్వడంతో విద్యుత్‌ శాఖ అధికారుల సాయంతో విద్యుత్‌ సరఫరాను నిలిపివేసి దానిని కిందికి దించి అడవి వైపు పంపించారు. మర్నాగిని కాపాడిన బీట్‌ ఆఫీసర్‌ సందీప్‌తో పాటు సమాచారం అందించిన గ్రామస్తులను ఎఫ్‌ఆర్‌వో రవిమోహన్‌ భట్‌ అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement