నూతన కార్యవర్గం ఎన్నిక | - | Sakshi
Sakshi News home page

నూతన కార్యవర్గం ఎన్నిక

Sep 27 2026 3:58 AM | Updated on Sep 27 2026 3:58 AM

తెయూ(డిచ్‌పల్లి): ఏబీవీపీ తెలంగాణ యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో శనివారం ఇంజినీరింగ్‌ కళాశాల నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా అష్మిత, ప్రధాన కార్యదర్శిగా దీపక్‌, ఇన్‌చార్జిగా నికిల్‌, ఉపాధ్యక్షులుగా రితిక, రాము, భానుప్రసాద్‌, మోహన్‌ చంద్ర, శివ, అరవింద్‌ ఎన్నికయ్యారు. అలాగే ఐదుగురు, సంయుక్త కార్యదర్శులు, ఇద్దరు సోషల్‌ మీడియా ఇన్‌చార్జిలు, 8మంది కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. తెయూ ఏబీవీపీ అధ్యక్షుడు సమీర్‌, కార్యదర్శి మోహన్‌, యూనివర్సిటీ ఇన్‌చార్జి ప్రవీణ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి

తెయూ(డిచ్‌పల్లి): తెయూ ఇంజినీరింగ్‌ కళాశాలలో శనివారం తెలంగాణ యూనివర్సిటీ బీసీ సెల్‌ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఐల మ్మ చిత్రపటానికి కళాశాల సిబ్బంది పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆర్ట్స్‌ కాలేజ్‌ ప్రిన్సిపాల్‌ రాంబాబు, బీసీ సెల్‌ డైరెక్టర్‌, ఇంజ నీరింగ్‌ కాలేజ్‌ ప్రిన్సిపాల్‌ సిహెచ్‌ ఆరతి, బీఈడి కళాశాల ప్రిన్సిపాల్‌ సాయిలు తదితరులు పాల్గొన్నారు.

బెటాలియన్‌లో..

డిచ్‌పల్లి: మండలంలోని రాష్ట్ర ప్రత్యేక పోలీస్‌ ఏడవ బెటాలియన్‌లో శనివారం వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఐలమ్మ చిత్రపటానికి కమాండెంట్‌ సీతారాం పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ కమాండెంట్లు నరసింహరావు, విజయ్‌, బెటాలియన్‌ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

కళాశాల గుర్తింపు రద్దు చేయాలి

తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో కామారెడ్డి జిల్లా బిచ్కుందలో ఉన్న సద్గురు బండాయప్ప బీఈడీ కళాశాల గుర్తింపు రద్దు చేయాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్‌ చేశారు. ఈమేరకు శనివారం వర్సిటీ ఏబీవీపీ అధ్యక్ష, కార్యదర్శులు సమీర్‌, మోహన్‌ ఆధ్వర్యంలో అకడమిక్‌ ఆడిట్‌ సెల్‌ డైరెక్టర్‌ ఘంటా చంద్రశేఖర్‌కు వినతిపత్రం అందజేశారు. తెయూ అధికారులు తక్షణమే స్పందించి సదరు కళాశాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఏబీవీపీ ప్రతినిధులు ప్రవీణ్‌, అనిల్‌, రామకృష్ణ, నాగరాజు, భార్గవ్‌, ప్రీతం పాల్గొన్నారు.

‘సముదాయ కథలు’

పుస్తకావిష్కరణ

కమ్మర్‌పల్లి: మండలంలోని చౌట్‌పల్లి పీఎంశ్రీ జెడ్పీహెచ్‌ఎస్‌లో శనివారం నిర్వహించిన మూడు మండ లాల కాంప్లెక్స్‌ స్థాయి సమావేశంలో ఉపాధ్యాయు లు రచించిన ‘సముదాయ కథలు’ పుస్తకాన్ని మండల విద్యాధికారి ఆంధ్రయ్య ఆవిష్కరించారు. గత నెలలో జరిగిన కాంప్లెక్స్‌ సమావేశంలో ఏర్గట్ల పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడు ప్రవీణ్‌శర్మ ఆధ్వర్యంలో కథారచన కార్యశాల నిర్వహించారు. ఏర్గట్ల, కమ్మర్‌పల్లి, మోర్తాడ్‌ మండలాలకు చెందిన తెలుగు ఉపాధ్యాయులతోపాటు చౌట్‌పల్లి పాఠశాల విద్యా ర్థులకు కథలు, కవితలు రాయడంలో మెళకువలను నేర్పించారు. ఈ కార్యశాల స్ఫూర్తితో పలువురు ఉపాధ్యాయులు నీతి కథలను రచించగా, వాటిని ప్రవీణ్‌శర్మ సంపాదించి పుస్తక రూపంలోకి తీసు కొచ్చారు. ఈ సందర్భంగా ఆంధ్రయ్య మాట్లాడుతూ.. కాంప్లెక్స్‌ సమావేశంలో ఇలాంటి సాహిత్య కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రవీణ్‌శర్మ మాట్లాడుతూ.. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో విద్యార్థులు కూడా కథలు, కవితలు రాస్తూ సాహిత్య అభిరుచిని పెంపొందించుకోవా లని ఆకాంక్షించారు. ఆయా మండలాల తెలుగు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement