దుబాయ్‌లో ఆలూర్‌ వాసి మృతి | - | Sakshi
Sakshi News home page

దుబాయ్‌లో ఆలూర్‌ వాసి మృతి

Sep 27 2026 3:58 AM | Updated on Sep 27 2026 3:58 AM

దుబాయ్‌లో ఆలూర్‌ వాసి మృతి

పెర్కిట్‌(ఆర్మూర్‌): ఉపాధి నిమిత్తం దుబాయ్‌ వెళ్లిన ఓ వ్యక్తి అనారోగ్యంతో మృతిచెందాడు. వివరాలు ఇలా.. ఆలూర్‌ మండల కేంద్రానికి చెందిన గడ్డం చ రణ్‌ కరుణాకర్‌(44) ఆటో నడుపుకుంటూ జీవనం సాగించేవాడు. దీంతో కుటుంబ పోషణ భారం కావడంతో ఉపాధి కోసం ఈనెల 14న దుబాయ్‌ వెళ్లాడు. వారం రోజులకే అతడికి ఫిట్స్‌ రావడంతో మృతి చెందాడు. కాగా మృతుడికి భార్య సునీత, ఇద్దరు కూతుళ్లు కావేరి, కావ్య ఉన్నారు. అసలే నిరుపేద కుటుంబం, ఇంటికి పెద్ద దిక్కును కోల్పోవడంతో వారి పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురావడానికి ప్రభుత్వం సహాయం చేయాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.

అక్బర్‌నగర్‌లో యువకుడి ఆత్మహత్య

రుద్రూర్‌: మండలంలోని అక్బర్‌నగర్‌ బెడ్‌రూం కాలనీలో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై మనోజ్‌ కుమార్‌ తెలిపిన వివరాలు ఇలా.. కాలనీకి చెందిన కట్టు రాహుల్‌ (28) కిరాణ దుకాణం నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. శనివారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ కలహాలతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement