మోపాల్: మండలంలోని న్యాల్‌కల్‌లోగల నిజాంసాగర్ కెనాల్‌లో గల్లంతైన బత్తుల దశరథ్ మృతదేహం లభ్యమైనట్లు ఎస్సై జాడె సుస్మిత శనివారం తెలిపారు. దశరథ్ స్నానం చేసేందుకు శుక్రవారం నిజాంసాగర్ కెనాల్‌లో దిగి గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని ఈతగాళ్లతో గాలింపు చేపట్టగా శనివారం ఉదయం మృతదేహం లభ్యమైంది. మృతుడి భార్య వనజ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఆయన తెలిపారు.
చెరువులో పడి ఒకరి మృతి
నిజామాబాద్ అర్బన్: నగరంలోని రఘునాథ చెరువులో శనివారం ఉదయం ఓ వ్యక్తి పడి మృతిచెందినట్లు 5వ టౌన్ ఎస్సై సునీల్ తెలిపారు. నగరంలోని బర్కత్‌పురకు చెందిన ఇమ్రాన్(42) అనే వ్యక్తి చెరువులోకి దిగి, నీటిలో జారిపోయి మృతిచెందాడన్నారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేర కు కేసు నమోదు చేసుకున్నట్లు ఆయన తెలిపారు.


