ఇట్టే ఆకట్టుకుంటుంది | - | Sakshi
Sakshi News home page

ఇట్టే ఆకట్టుకుంటుంది

Sep 27 2026 3:58 AM | Updated on Sep 27 2026 3:58 AM

బర్త్‌డే వేడుకల్లో అపశృతి

నా కూతురు తన మాటలతో ఎవరినైనా ఇట్టే ఆకట్టుకుంటుంది. ఆమెను చూస్తే ప్రతి ఇంట్లో ఆడ పిల్ల ఉండాల్సిందే అనిపిస్తుంది.

బాన్సువాడ రూరల్‌: బీర్కూర్‌ మండలం కిష్టాపూర్‌ గ్రామంలో ఒకరి పుట్టిన రోజు వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా.. కిష్టాపూర్‌ గ్రామానికి చెందిన రవి శనివారం తన తొమ్మిదేళ్ళ కుమార్తె రీతు పుట్టిన రోజు నిర్వహించారు. వేడుకల్లో భాగంగా బాలిక గన్‌ స్పార్కులర్‌ పట్టుకుని కాలుస్తుండగా ఒక్కసారిగా పేలి ఆమె ముఖంపై పడి గాయాలయ్యాయి. దీంతో ఆ బాలికను బాన్సువాడ ఆస్పత్రికి తరలించారు. తన కుమార్తెకు గాయాలు కావడంతో రవి బీర్కూరుకు వెళ్లి స్పార్కులర్‌ దుకాణదారుడితో వాగ్వావాదానికి దిగాడు. కాలం చెల్లిన, నాసిరకం గన్‌ ఇవ్వడంతోనే కుమార్తెకు గాయాలయ్యాయని ఆరోపించారు. ఈ విషయంపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు బీర్కూర్‌ ఎస్సై రాములు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement