ఆర్మీలో రైతు కూతురు.. | - | Sakshi
Sakshi News home page

ఆర్మీలో రైతు కూతురు..

Sep 27 2026 3:46 AM | Updated on Sep 27 2026 3:46 AM

మోపాల్‌ : మోపాల్‌ మండలం మారుమూల గ్రామమైన కాల్పోల్‌ తండాకు చెందిన బస్సీ యమునాబాయి, హస్రాజ్‌ దంపతులకు నలుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. నలుగురు కుమార్తెల్లో చిన్న కూతురు బస్సీ మౌనిక చదువుతోపాటు ఆటపాటల్లో రాణించేది. గిరిరాజ్‌ కళాశాలలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతుండగా అగ్నివీర్‌ (ఆర్మీ)కి ఎంపికై ంది. మథుర (లబానా) సామాజికవర్గంలో నిరక్షరాస్యులే ఎక్కువ. అందులోనా అమ్మాయిని ఉన్నత చదువులు చదివించాలంటే చాలా కష్టం. ఆమె ఎంపికతో సామాజికవర్గం మొత్తం గర్వపడుతోంది. సామాన్య వ్యవసాయ కుటుంబం, మారుమూల పల్లె, మథుర సామాజికవర్గం అయినప్పటికీ అన్ని అవరోధాలను దాటుకుంటూ మౌనిక ఉన్నత స్థానానికి చేరుకుంది. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో విధులు నిర్వహిస్తోంది. ప్రస్తుతం ఉత్తరాఖండ్‌లో మౌనిక ప్రత్యేక శిక్షణ పొందుతున్నారు. ‘ మా కూతురు దేశం గర్వించే ఉద్యోగం చేస్తున్నందుకు సంతోషంగా ఉంది’ అని చెబుతున్నారు బస్సీ యమునాబాయి హస్రాజ్‌ దంపతులు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement